బిగ్ బాస్ సీజన్ 6 (BiggbossSeason6) నుంచి అభినయ శ్రీ (AbhinayaSri) ఔట్.. సింగర్ రేవంత్ కన్నింగ్ అంటూ వ్యాఖ్యలు

Updated on Sep 20, 2022 11:14 AM IST
అభినయ శ్రీ ఎలిమినేట్ అయిందని నాగ్ చెప్పడంతో, హౌస్‌లో ఉన్నవారు ఎమోషనల్ అయ్యారు.
అభినయ శ్రీ ఎలిమినేట్ అయిందని నాగ్ చెప్పడంతో, హౌస్‌లో ఉన్నవారు ఎమోషనల్ అయ్యారు.

తెలుగు బిగ్ బాస్ (Telugu Biggboss) ఇంట్లో రెండో వారం గడిచింది. మొదటి వారంలో ఎలిమినేషన్ లేకుండా ఏదోలా నెట్టుకొచ్చినా.. రెండో వారంలో మాత్రం డబుల్ ఎలిమినేషన్‌తో షాక్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ఈ వారం ఏకంగా ఇద్దరిని హౌస్ నుంచి బయటకు పంపించేశారు. శనివారం నాటి ఎపిసోడ్‌లో షానీ సల్మాన్ బిగ్ బాస్‌ను వీడగా.. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో అభినయ శ్రీ ఎలిమినేట్ అయింది. 

అంతకుముందు బిగ్ బాస్ ఇంట్లో మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah) తన 'బబ్లీ బౌన్సర్' సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు వచ్చి సందడి చేసింది. దాదాపు ఓ అరగంట పాటు బబ్లీ బౌన్సర్ కాన్సెప్ట్‌తో టాస్క్ ఆడించారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న మగ కంటెస్టెంట్లు.. లేడీ కంటెస్టెంట్లలో తమకు కావాల్సిన లేడీ బౌన్సర్‌ని ఎంచుకోవాలి. వారు ఎవరో చెప్పమని, తమను ఎవరి నుంచి కాపాడాలో కూడా చెప్పమని బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ఇక ఈ టాస్క్‌లో భాగంగా హౌస్ మేట్స్‌ను రెండు టీమ్స్‌గా డివైడ్ చేయగా.. రేవంత్ టీమ్ విన్ అయ్యింది.

ఆ తరువాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో ఆదిరెడ్డి (Aadi Reddy), అభినయ శ్రీ (Abhinaya Sri) చివరకు మిగిలారు. అభినయ శ్రీ ఎలిమినేట్ అయిందని నాగ్ చెప్పడంతో హౌస్‌లో ఉన్నవారు కాస్త ఎమోషనల్ అయ్యారు. గీతూ అయితే ఎగురుకుంటూ వచ్చి ఆదిరెడ్డికి కంగ్రాట్స్ చెప్పింది. "నాకు ఇష్టమైన వాళ్లు వెళ్లిపోతున్నారు అని శ్రీ సత్య అంటే.. "అందుకే ఎవ్వరినీ ఇష్టపడకు" అంటూ ఆమె బదులిస్తుంది. అలాగే ఆదిరెడ్డి ఎలిమినేట్ అయి ఉంటే "నేను చాలా బాధపడేదాన్ని" అని గీతూ కూడా అంటుంది. 

ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన అభినయ శ్రీకి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇస్తాడు. ఇంట్లో నిజాయితీగా ఉన్న ఐదుగురితో పాటు, నిజాయితీగా లేని ఐదుగురి పేర్లు చెప్పమని అంటాడు.  ఫైమా, చంటి, శ్రీ సత్య, బాలాదిత్య (Bala Aditya), సూర్యలను (RJ Surya) నిజాయతీపరులుగా పేర్కొంటూ, వారి పేర్లు చెబుతుంది అభినయ.

అలాగే "బాలాదిత్య చాలా మంచివాడని, అతను బిగ్ బాస్ షోకు పనికి రాడని కూడా చెప్పాను. నామినేషన్‌లో కూడా ఎవ్వరూ బాధపడకూడదని చూస్తాడు. ఎవ్వరినీ బాధపెట్టడు. చాలా మంచి వాడు" అంటూ బాలాదిత్య గురించి మన మనసులోని మాటలను బహిర్గతం చేసింది అభినయ శ్రీ. అలాగే, మిగతా అందరూ మంచి వారేనని ఆమె తెలిపింది.

అలాగే నిజాయితీగా లేనివాళ్లలో సింగర్ రేవంత్ (Singer Revanth) ఒక్కడి పేరునే ప్రస్తావిస్తుంది అభినయ. "ఆట మధ్యలో వ్యక్తిగత విషయాలు చెబుతాడు. అది నాకు నచ్చలేదు. నువ్ కన్నింగ్‌లా అనిపిస్తున్నావంటూ" రేవంత్ మొహం మీదే చెప్పేసింది అభినయ శ్రీ.

Read More: బిగ్ బాస్ సీజన్ 6 లో మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah).. అర్జున్ కల్యాణ్ బౌన్సర్ గా శ్రీ సత్య.. ప్రోమో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!