పాడుతా.. తీయగా.. ఓటీటీలో
ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ షో ఆడియన్స్‌ను అలరిస్తుంది. గాయకులు అద్భుతంగా పాడుతున్నారు. లెజండరీ సింగర్ ఎస్పీ బాల సుబ్రమణ్యం పాటలతో ఆయనకు నివాళి అర్పించారు.
గాన గంధర్వుడు ఎస్పీబీ పాటలతో తెలుగు ఇండియన్ ఐడల్ ఫో పులకించింది. తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 15 ను ఎస్పీబీకి అంకితం ఇచ్చారు. ఆమని.. పాడవే.. హాయిగా.. అంటూ ఎస్పీబీ పాటలు ఆలపించి గాయకులు లెజండరీ సింగర్‌కు ఘన నివాళి అర్పించారు.
'ఓ ప్రియా.. ప్రియా.. నా ప్రియా.. ప్రియా' పాటకు అందరి కళ్లు చెమర్చాయి. భారతదేశానికి ఆణిముత్యం ఎస్పీ బాలుగారని గెస్ట్‌గా వచ్చిన సింగర్ కల్పన అన్నారు. గాయకుడు కార్తీక్ 'కోడి కోసం వచ్చావా గోపాల' సాంగ్ పాడి ఎంట్రర్‌ట్రైన్ చేశారు. నిత్యామీనన్ సరదా కామెంట్లు అందరికి హుషారు అనిపించాయి.
మారుతీ పాడిన 'అమ్మో నీ అమ్మ గొప్పదే' పాటకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇంప్రస్ అయ్యారు. మారుతీని హత్తుకుని మరీ పొగిడారు థమన్. బాలుగారితో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ షో కి వీక్షకుల నుంచి మంచి స్పందన అందుతుంది. పార్టిసిపెంట్స్ కి 15 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి.ఈ వారం సెకండ్ ఎలిమినేషనతో టాప్ 10 ఎవరో తేలనుంది.