Bigg Boss OTT Telugu: బాబా భాస్కర్ వచ్చేశాడు.. ఇక అసలైన ఆట మొదలు

Updated on Apr 20, 2022 09:08 PM IST
బిగ్ బాస్ మూడవ సీజన్‌లో బాబా చేసిన హల్చల్ అంతా కాదు
బిగ్ బాస్ మూడవ సీజన్‌లో బాబా చేసిన హల్చల్ అంతా కాదు

బిగ్ బాస్ హౌస్‌లోకి బాబా భాస్కర్ అడుగుపెట్టాడు. ఇంకేముంది.. హౌస్ అంతా ఆశ్చర్యపోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీగా అతను అడుగుపెట్టగానే అందరూ అవాక్కయ్యారు. అంతేకాదు.. అతను రాగానే బిందుమాధవిని నామినేషన్స్ నుండి సేవ్ చేశాడు. దీంతో కొంతమంది హౌస్ మేట్స్ హర్ట్ అయ్యారనే విషయం కచ్చితంగా తెలుస్తోంది. వచ్చేవారం, బాబాని నామినేట్ చేయడానికి కూడా ఒక గ్రూప్ సిద్ధమైందని వినికిడి.

నిజం చెప్పాలంటే, బిగ్ బాస్ మూడవ సీజన్‌లో బాబా చేసిన హల్చల్ అంతా కాదు. రెండవ రన్నరప్‌గా తన స్థానం పదిలం చేసుకున్నాడు. ఇప్పుడు ఇంత బలమైన కంటెస్టెంట్‌ని హౌస్‌లోకి పంపడం ద్వారా, ఆటను ఇంకా రక్తి కట్టించాలన్నదే బిగ్ బాస్ ప్లాన్. ఆ పథకంలో భాగంగానే బాబాను పంపారు. 

మూడవ సీజన్‌లో బాబా భాస్కర్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అతని ఎనర్జీ, యాటిట్యూడ్‌కి చాలామంది ఫిదా అయ్యారు. తమిళనాడులో పుట్టి పెరిగిన బాబా భాస్కర్ సుందరం మాస్టారి వద్ద జూనియర్‌గా జాయినై ఆ తర్వాత, మంచి కొరియోగ్రాఫరుగా ఎదిగారు. కుప్ప్తుత్తు రాజా సినిమాతో దర్శకుడిగా కూడా మారారు. సైనికుడు, కొత్త బంగారు లోకం, మగధీర, కేడి, జబర్దస్త్, లైగర్ లాంటి సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. సింగమ్ సినిమాకు గాను ఉత్తర కొరియోగ్రాఫరుగా ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా దక్కించుకున్నారు. 

తమిళంలో ఎక్కువ సినిమాలు చేసినా, తెలుగులో కూడా బాబాకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే ఈయన తెలుగు డ్యాన్స్ ప్లస్ ప్రోగ్రాములో న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!