Bithiri Satthi: టీవీ యాంక‌ర్ బిత్తిరి స‌త్తి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే!

Updated on May 29, 2022 03:56 PM IST
వెంక‌టేష్, మ‌హేష్ బాబుతో బిత్తిరి స‌త్తి (Bithiri Sathi With Mahesh babu and Venkatesh)
వెంక‌టేష్, మ‌హేష్ బాబుతో బిత్తిరి స‌త్తి (Bithiri Sathi With Mahesh babu and Venkatesh)

బిత్తిరి సత్తి (Bithiri Satthi).. ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అవస‌రం లేదు. న్యూస్ ఛానల్స్ లో పనిచేసే బిత్తిరివేషాలు, లొడాసు చెడ్డి, పూల షర్ట్ తో యావత్ తెలుగువాళ్లను ఆకట్టుకున్నాడు. బిత్తిరిసత్తి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాప్ యాంకర్. తనదైన స్టైల్ లో మాట్లాడుతూ.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కొన్నిరోజుల కింద‌టి వ‌ర‌కు టాలీవుడ్ లో టాప్ యాంకర్స్ ఎవరు అనగానే కొన్ని పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. అందులోనూ మొదటి పేరు సుమ క‌న‌కాల‌దే ఉంటుంది. అందుకే ఏ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగినా సుమనే హోస్ట్ గా వస్తుంది. అయితే కొన్ని రోజుల కింది వరకు సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు కూడా ఆమెనే పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని మరొకరు లాక్కున్నారు. అత‌డే బిత్తిరి సత్తి.

తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాకు చెందిన‌ సత్తి (Bithiri Satthi) ట్యాలెంట్ గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. టాలెంట్ లో కొత్తదనం చూపించేవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని నిరూపించాడు. ఒకప్పుడు కేవలం న్యూస్ ఛానల్స్ లో యాంకర్ గా ప‌నిచేసేవాడు. టీవీ ఛానెళ్ల ద్వారానే తన జీవితాన్ని ప్రారంభించిన సత్తి ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్ కు గుడ్ బై చెప్పి టీవీ యాంకర్ గా స్థిరపడిపోయాడు. కెరీర్ మొద‌ట్నించీ తనకంటూ ఓ ప్రత్యేక భాషను సృష్టించుకుని తనకే సాధ్యమయ్యే మ్యానరిజాన్ని ఆయన సొంతం చేసుకున్నాడు. దీంతో పలు సినిమా సెల‌బ్రిటీలు ఆయ‌న‌తో ఇంటర్వ్యూ చేయించుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు.
 
మొద‌ట్లో వి6 ఛానల్ (V6 News) లో ‘తీన్మార్ వార్తలు’ అనే కార్యక్రమం ద్వారా తన కెరీర్ ని ప్రారంభించిన ఈయన.. ఆ షో ద్వారా చాలా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన మాట్లాడే పద్ధతి.. చాలా అమందిని ఎంటర్ టైన్ చేసింది. డిఫరెంట్ గెటప్, ఆహార్యంతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కొత్తగా విడుదలైన సినిమాలు, రాజకీయ పరిణామాలపై, ఇతర సంగతులపై సత్తి చేసే పేరడీలకు మంచి స్పందన వచ్చింది.

 ఆర్ఆర్ఆర్ టీమ్ తో బిత్తిరి స‌త్తి (Bithiri Sathi with RRR Ream)

పక్కా తెలంగాణ యాసలో కొంచెం పదాలను మారుస్తూ మాట్లాడి బాగా ఫేమస్ అయ్యాడు బిత్తిరి స‌త్తి (Bithiri Satthi). అయితే ఈ మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ ఛానెల్ తరపున ఇంటర్వ్యూ చేసాడు. అది సూపర్ హిట్ అయ్యింది. కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. దాంతో ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ ఛానెల్ లో మానేసిన బిత్తిరి సత్తి ఇప్పుడు అన్ని సినిమాలకు ఇంటర్వ్యూ లు చేస్తున్నాడు. ఈ ఒక్క ఆర్ఆర్ఆర్ ఇంట‌ర్వ్యూ హిట్ అయిన తర్వాత, మహేష్ బాబు సర్కారు వారి పాట, F3 సినిమాలకు కూడా ఇంటర్వ్యూలు చేసాడు. అయితే ఇలా వరుస సినిమాల ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కొంత ఆసక్తిగా మారింది. 

ఆర్ఆర్ఆర్ (RRR), ఆచార్య, సర్కారి వారిపాట, ఎఫ్ 3 హీరోలు, డైరెక్టర్లతో ఇంటర్వ్యులు చేయడంతో ఆ షో లు మంచి ఆదరణ పొందాయి. ఫలితంగా ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడు. ప్ర‌స్తుతం ఒక్కో షో కు బిత్తిరి సత్తి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు వ‌ర‌కు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఫేమ‌స్ యాంక‌ర్ సుమ క‌న‌కాల‌ కంటే ఎక్కువ ఆదాయం అందుకుంటున్నాడు. అయితే, మిగతా యాంకర్లతో పోల్చుకుంటే సత్తి యాంకరింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. తెలంగాణ యాసతో, చిన్న పిల్లవాడి లాగా ఉంటుంది ఆయన యాంకరింగ్. దీంతో అందరికి ఆయన ప్రోగ్రామ్ అంటే బాగా నచ్చుతుంది ఫలితంగానే సత్తికి రెమ్యూన‌రేషన్ బాగా పెరిగింది. పేద కుటుంభం నుండి వచ్చిన సత్తి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్తాయిగా చెరిగిపోని ముద్రవేసుకున్నాడు బిత్తిరి సత్తి. కాగా, ఆయ‌న‌కు సినిమా ఆఫర్లు కూడా వస్తుండగా ఆ విషయంలో బిత్తిరి సత్తి ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!