Biggboss Season 6: ఈ వారం కెప్టెన్సీ టాస్క్.. ‘స్నేక్ vs ల్యాడర్’ (Snake vs Ladder).. ఎమోషన్ అయిన కీర్తి!
Biggboss Season 6: బిగ్ బాస్ హౌస్ లో గత వారం కెప్టెన్సీ టాస్క్ ఎంత కాక రేపిందో తెలిసిందే. ఆ గేమ్ లో ఇంటి సభ్యులందరూ కూడా చెలరేగి ఆడారు. నిన్నటి 10వ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. దీంతో నేటి నుంచి కంటెస్టెంట్లకు కెప్టెన్సీ టాస్కు ఆడే సమయం వచ్చేసింది. ఇందులో భాగంగా ‘స్నేక్ vs ల్యాడర్’ ఆటని బిగ్ బాస్ నిర్వహించాడు.
మొన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున (Host Nagarjuna) ఇంటి సభ్యులతో ఎవరు పాము? ఎవరు నిచ్చెన? అనే ఆట ఆడించారు. ఆ పామునే ఈ ఆటలోనూ ఉపయోగించారు. తాజాగా ఈ రోజు ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో భాగంగా ఈ వారం పోటీ దారులు కెప్టెన్ గా నిలవడానికి పాము, నిచ్చెన ఆట ఆడాల్సి ఉంటుందని శ్రీహన్ బిగ్ బాస్ అందించిన ఆదేశాల గురించి చదివి వినిపించాడు.
‘స్నేక్ vs ల్యాడర్’ (Snake vs Ladder) టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక మూల ‘వేర్ హౌస్’ నిర్మించారు. అందులో సమయానుసారంగా మట్టిని పెడుతూ వచ్చారు. ఆ మట్టిని తెచ్చి సగం మంది ఇంటి సభ్యులు నిచ్చెనలు కట్టాలి. సగం మంది ఇంటి సభ్యులు పామును నిర్మించాలి.
ఇక నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ లోని హైలెట్స్ లోకి వెళితే.. ఈ ఆటలో అమ్మాయిలు కూడా చాలా గట్టిగానే పోరాడినట్టు అర్థమైంది. ముఖ్యంగా ఇనయా సుల్తానా (Inaya) అలాగే మెరీనా కూడా అబ్బాయిల కంటే దూకుడుగా కనిపించారు. ముందుగా వెళ్లి బకెట్స్ లో మట్టిని తెచ్చుకున్నారు.
ఆ తరువాత పాము బుస్ మనే శబ్ధాన్ని ఇచ్చినప్పుడు పాము బొమ్మలు నిర్మించిన వారిలో ఒకరు, నిచ్చెనలు కట్టిన వారిలోని ఒకరిని ఎంచుకుని వారి నిచ్చెనలోని మట్టిని లాక్కోవాల్సి ఉంటుంది. అయితే కీర్తికి (Keerthy Bhatt) అవకాశం రావడంతో రాజ్ కట్టిన నిచ్చెనలోని మట్టిని తీసేందుకు ప్రయత్నించింది. ఒంటి చేత్తోనే కష్టపడింది. కానీ ఆమెకు వీలు కాకపోవడంతో ఏడ్చేసింది. అందరూ వచ్చి ఓదార్చారు.
‘చెయ్యి నొప్పేస్తున్నందుకు కూడా నాకు బాధలేదు.. కానీ ఇది నా ఆటకి అడ్డు వస్తుందని బాధేస్తుంది’ అంటూ ప్రోమో చివర్లో ఆమె ఏడవడంతో ఇది సభ్యులందరూ ఆమెని ఓదారుస్తున్నారు.. కానీ అంతకుముందు ఆమె ఈ టాస్కులో ఏకంగా మగవాళ్ళతో పోటీ పడింది.. ఫిజికల్ గా శ్రీ సత్య (Sree Satya) తో తలపడి ఆమెని ఓడించేస్తుంది కూడా.. వేలు విరిగినప్పటికీ కూడా టాస్కుని ఇంత కసిగా ఆడిన కీర్తికి సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
మరోవైపు.. ఈ ఆటలో రేవంత్ (Singer Revanth) ఊహించని విధంగా వచ్చిన మట్టిని మొత్తం తానే తీసుకువెళ్లడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మొత్తం మట్టి ఎత్తుకుపోవడంపై ఇతర కంటెస్టెంట్స్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్కరికి కూడా మట్టి ఇవ్వను అని బలంగా చెప్పేశాడు. దీంతో ఆదిరెడ్డి (Adi Reddy) మొత్తం తెచ్చుకుంటే ఎలా బ్రో అని ప్రశ్నించాడు. అది నా ఇష్టం బ్రో అని రేవంత్ బదులిచ్చాడు. నేను అయితే ఎవరి నుంచి లాక్కోలేదు అని గేమ్లో భాగంగానే తీసుకువచ్చాను అని అన్నాడు. ఇక ఈ వారం నామినేషన్ల విషయానికి వస్తే తొమ్మిది మంది నామినేషన్లలో నిలిచారు.