Bigg Boss Season 6: గీతూ రాయల్ (Geetu Royal) ఎలిమినేషన్ తర్వాత హీటెక్కిన హౌస్.. రెచ్చిపోయిన కంటెస్టెంట్స్..!

Updated on Nov 07, 2022 06:13 PM IST
ఈ వారం నామినేషన్స్ ఫుల్‌ జోష్‌ మీద జరిగేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోను (Telugu Biggboss Promo) బట్టి చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది.
ఈ వారం నామినేషన్స్ ఫుల్‌ జోష్‌ మీద జరిగేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోను (Telugu Biggboss Promo) బట్టి చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది.

Bigg Boss Season 6: బిగ్ బాస్ తెలుగు సీజన్6 లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన గీతూ రాయల్ (Geetu Royal) వెళ్లిపోవాలని చాలామంది బలంగా కోరుకున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం గీతూ వెళ్లిపోతుంటే ఎంతోమంది ఎమోషనల్ అయ్యారు. సింగర్ రేవంత్ తోపాటు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన గీతూ రాయల్ మధ్యలోనే ఎలిమినేట్ కావడం మిగతా ఇంటి సభ్యులకు షాకిచ్చింది.  

నిజానికి గీతూ రాయల్‌పై (Geetu Royal) నెగెటివిటీ ఉన్న మాట వాస్తవమే.. కానీ, ఎలిమినేట్‌ అవుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. గీతూ అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మొదలు పెట్టిన ఏడుపు.. స్టేజ్‌ మీద కూడా ఆపలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హౌస్‌ లోని కంటెస్టెంట్స్ మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారో అని భయంతో ఉన్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ వారం నామినేషన్స్ కూడా ఎప్పటిలాగానే ఫుల్‌ జోష్‌ మీద జరిగేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ప్రోమోను (Telugu Biggboss Promo) బట్టి చూస్తుంటే ఆ విషయం అర్థమవుతోంది. ఇక, నామినేషన్ ప్రక్రయలో భాగంగా నామినేట్ చేయాలనుకున్న ఇంటి సభ్యులను వారి మొహంపై ఎరుపు రంగు నీళ్లు కొట్టి కారణాలు చెప్పాలి.

ఈ క్రమంలో ఇనయాని (Inaya Sultana) టార్గెట్ చేసిన హౌస్‌మెట్స్‌పై ఆమెపై మాటల దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇనయాని నామినేట్ చేసిన శ్రీసత్య.. గత వారం శ్రీహాన్, తన గురించి తప్పుగా మాట్లాడటాన్ని కారణంగా చూపుతూ కనిపించింది. ఇద్దరూ ఒకే బెడ్‌పై పడుకుంటున్నారని ఇనయ చెప్పడంపై శ్రీసత్య మండిపడుతూ.. తనకీ (శ్రీహాన్) ఓ లైఫ్‌ ఉంది. నాకూ ఒక లైఫ్ ఉంది. ఇది చాలా సునిత్నమైన విషయం అంటూ మండిపడింది. 

తర్వాత వచ్చిన కీర్తి.. శ్రీహాన్ (Shrihan) ను నామినేట్ చేసింది. చివరి నామినేషన్ లో మీరు హ్యుమానిటీ గురించి మాట్లాడారని కీర్తి అంటే.. హ్యుమానిటీ గురించి నేను హైలెట్ చేసుకోలా.. నువ్ హీరోయిన్ లా చేసుకున్నావ్ అని శ్రీహాన్ అన్నాడు. దీంతో కీర్తి.. ఇక్కడ ఎవరు హీరోలు, హీరోయిన్లు లేరు. అదే తగ్గించుకుంటే మంచిదని అంది. అందుకు శ్రీహాన్ తగ్గించుకోను అని సమాధానమిచ్చాడు.

అనంతరం, వాసంతి గేమ్ ఆడుతున్న తీరుని తప్పుబట్టిన రేవంత్ ఆమెని నామినేట్ చేశాడు. గేమ్ అంటే ముందుకు వచ్చి ఆడేదని.. వెనక్కి వెళ్లి ఆడటం కాదంటూ మొట్టికాయలు వేశాడు. ఆ తర్వాత రేవంత్‌ని (Singer Revanth) నామినేట్ చేసిన ఆదిరెడ్డి (Aadi Reddy).. అతని దుందుడుకు స్వభావాన్ని తగ్గించుకోవాలని హితవు పలికాడు. దాంతో రేవంత్ రివర్స్‌లో అది నా గేమ్ ప్లాన్.. ఏం రాలేవా? అన్నట్లు గొడవకి పిలిచాడు. దానికి ఆదిరెడ్డి.. నేను బక్క పలచగా ఉన్నా ఇక తగ్గను అని సవాల్ విసిరాడు.

తర్వాత ఆదిరెడ్డి (Aadi Reddy) కూడా ఇనయాను నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఏడవడం, బిగ్ బాస్ పిలిస్తేనే బయటకు వస్తాననడం తప్పనిపించలేదా? అని అడిగాడు. దీనికి ఆమె.. అది నాకు, బిగ్ బాస్ కు మధ్య విషయం, మధ్యలో మీకెందుకు అని ప్రశ్నించింది. బిగ్ బాస్ కు నీకు ఉంటే బయటకెళ్లి చూసుకోండి ఇక్కడ కాదు అంటూ మాట్లాడాడు ఆదిరెడ్డి. ఇలా జరుగుతుండగా.. శ్రీహాన్ అండ్ శ్రీ సత్య నవ్వు ఆపుకుంటూ ఓవర్ చేశారు. చివరిగా అయ్యో.. అని శ్రీహాన్ అనడంతో ప్రోమో ముగిసింది.

Read More: అందాల డోసు అమాంతం పెంచేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ దివి (Divi Vadthya)..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!