బిగ్ బాస్ తెలుగు ఓటీటీ (Bigg Boss Telugu OTT): యాంకర్ శివ-బిందు మాధవిల మధ్య పెరుగుతున్న దూరం!

Updated on Apr 26, 2022 03:06 PM IST
Anchor Shiva (యాంకర్ శివ) & Bindu Madhavi (బిందు మాధవి)
Anchor Shiva (యాంకర్ శివ) & Bindu Madhavi (బిందు మాధవి)

తెలుగులో బిగ్ బాస్ షో గత ఐదు సీజన్లుగా విజయవంతం కావడంతో, ఇటీవల ఈ షోను డిస్నీ ప్లస్ ఓటీటీలో నాన్ స్టాప్ పేరిట మొదలు పెట్టారు. ఇందులో కొత్తవారితో పాటు గత సీజన్లలోని కంటెస్టెంట్‌లు కూడా ఎంట్రీ ఇచ్చారు.

కాగా, మొత్తం 17మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇప్పటివరకు.. 8వారాలకుగానూ ఎనిమిది మంది కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అయ్యారు. వారిలో ముమైత్ ఖాన్ (రెండు సార్లు), శ్రీ రాపాక, ఆర్జే చైతు, సరయు, తేజస్వి, స్రవంతి చొక్కారపు, మహేష్ విట్టా, అజయ్ కతుర్వార్ ఉన్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ ఎప్పటిలాగానే వాడివేడిగా, కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలతో సాగింది. ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో భాగంగా దిష్టిబొమ్మల తలలకు కుండలతో పాటు కంటెస్టెంట్ల ఫొటోలను పెట్టారు. 

నామినేట్ చేయాలనుకునే కంటెస్టెంట్ కుండను బ్యాట్‌తో పగలగొట్టాలని వారికి సూచించారు. దీంతో రెచ్చిపోయిన ఇంటి సభ్యులు వారి ఫ్రస్టేషన్ అంతా ఆ కుండలపై తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఇన్ని రోజులు ఇంట్లో సన్నిహితంగా మెలిగిన యాంకర్ శివ, బిందు మాధవిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బిందు, శివను నామినేట్ చేసింది. ఇందుకు కారణంగా పోయిన వారంలో ఒక విషయంలో ఎఫెక్ట్ అయిన నాకు నువ్వు స్టాండ్ తీసుకోలేదని చెప్పింది. దీంతో ఇన్ని రోజులుగా మిత్రులుగా ఉన్న వారి మధ్య దూరం పెరిగిపోయింది.    

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!