టీనా సాధు (Tina Sadhu) : ప్రముఖ కొరియోగ్రాఫర్, "ఆట" తొలి సీజన్ విజేత మృతి

Updated on May 12, 2022 03:34 PM IST
ప్రముఖ రియాలిటీ షో "ఆట"కి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ప్రముఖ నాట్యకారిణి టీనా ఈ రోజు మృతి చెందారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. 

ఓంకార్‌ సారథ్యంలో చిన్నితెరపై ఒకప్పుడు సూపర్ సక్సెన్ అయిన డ్యాన్స్‌ రియాలిటీ షో "ఆట". ఈ ప్రోగ్రామ్ తొలి సీజన్‌ విజేతగా నిలిచిన డ్యాన్సర్ పేరు "టీనా". ఆమె పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు. టీనా మరణవార్తను గురించి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. 

"టీనా సాధు (Tina Sadhu) మరణవార్త నన్ను చాలా షాక్‌కు గురిచేసింది. ఆట ప్రోగ్రాంలో.. నా డ్యాన్స్ పార్టనర్‌‌గా వ్యవహరించిన టీనా మరణవార్త నన్ను చాలా బాధించింది. ఆమె ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతి. టీనా ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలి" అంటూ సందీప్‌  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్టు చేశారు. 

టీనా మరణవార్త టెలివిజన్ ఇండస్ట్రీలో చాలామందిని షాక్‌కు గురిచేసింది. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో ఆమెతో గల తమ అనుబంధాన్ని పంచుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఆట సీజన్‌-1 లో విజేతగా ట్రోఫీ గెలిచిన టీనా.. ఆ తర్వాత సీజన్‌-4 లో న్యాయనిర్ణేతగా కూడా అవకాశాన్ని చేజేక్కించుకున్నారు. సీనియర్ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టారుతో కలిసి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం పొందారు. అయితే అనేక సంవత్సరాలుగా, ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హఠాన్మరణం చెందడం నిజంగానే షాకింగ్ విషయం. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!