బిగ్ బాస్ ఓటీటీ (BiggBoss OTT): ఫ్యామిలీ వీక్ లో న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎమోష‌న‌ల్

Updated on Apr 28, 2022 07:31 PM IST
Biggboss Nonstop Show
Biggboss Nonstop Show

తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) షో ప్ర‌స్తుతం 9వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఇంటి స‌భ్యుల‌ ఫ్యామిలీని హౌస్ లోకి వ‌చ్చేలా ఏర్పాటు చేశారు. ప్రతీ సీజ‌న్ లాగానే ఈ సీజన్‌లో కూడా ఈ ఫ్యామిలీ వీక్ చాలా కీలకం. కంటెస్టెంట్స్ సంబంధించిన‌ ఇంటి సభ్యులు గానీ, స్నేహితులు గానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి.. వారి ఆటతీరుపై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. 

ఆ వీడియోలో అషురెడ్డి తల్లి, యాంకర్ శివ చెల్లి, నటరాజ్ మాస్టర్ భార్య నీతూ, ఆయన కూతురు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన‌ట్లు చూపించారు. ప్రోమోలో తొలుత అషురెడ్డి త‌ల్లి ఏకంగా చీపురు పట్టుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. అస‌లు బిగ్ బాస్ లోకి ‘ఏం చేయడానికి వచ్చావ్ ఇక్కడికి.. గేమ్ ఆడటానికి వచ్చావా? ఎమోషన్స్ పెంచుకోవడానికి వచ్చావా? దేని కోసం వచ్చావు..? అని చీపురు పట్టుకుని నిలదీయ‌డంతో అషురెడ్డి బిత్త‌ర‌పోయి చూస్తూ ‘చీపురు ఎందుకు తెచ్చావ్ మమ్మీ.. పరువు పోతుంది’ అంటూ హంగామా చేసింది. 

అనంత‌రం నటరాజ్ మాస్టర్ భార్య నీతూ తన కూతుర్ని తీసుకుని హౌస్‌లోకి ఎంట‌ర్ కావ‌డంతో  తన చిన్నారి కూతుర్ని చూసి మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు. ఆమెతో ఆడుకుంటూ.. వీపుపై కూర్చోబెట్టుకొని హౌస్ అంతా తిరుగుతూ మురిసిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!