kirrak RP: ప్రేయ‌సితో నిశ్చితార్థం చేసుకున్న‌ కిరాక్ ఆర్పీ.. ఫొటోలు వైరల్‌!

Updated on May 26, 2022 05:48 PM IST
నిశ్చితార్థం చేసుకున్న‌ కిరాక్ ఆర్పీ (kirrak RP, Laxmi Prasanna)
నిశ్చితార్థం చేసుకున్న‌ కిరాక్ ఆర్పీ (kirrak RP, Laxmi Prasanna)

ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth) దాదాపు 8 ఏళ్ళుగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ షో ద్వారా చాలా మంది క‌మెడియ‌న్లు పాపులర్ అయ్యారు. ఆ లిస్ట్ లో చాలా మంది అనామ‌కులు సైతం ఉన్నారు. అయితే అందులో కిరాక్ ఆర్పీ (kirrak RP) కూడా ఒకరు. తనదైన పంచులతో ప్రేక్ష‌కుల‌ను నవ్విస్తూ పాపులర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. టైమింగ్‌ మిస్‌ కాకుండా పంచ్‌లు వేస్తూ స్కిట్లు వదులుతుంటాడు. ప్రజలను పొట్టచెక్కలయ్యేలా నవ్వించే కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ తాజాగా పెళ్లి కొడుకుగా ముస్తాబయ్యాడు. 

తాజాగా త‌న‌ ప్రేయసి లక్ష్మీ ప్రసన్నతో నిశ్చితార్థం (Engagement) చేసుకున్నాడు. ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి జ‌బ‌ర్ద‌స్త్ మిత్రులు, క్లోజ్ ఫ్రెండ్స్ ను ఆహ్వానించాడు. 

కాగా, ఆర్పీ జబర్దస్త్ నుండి బయటకి వెళ్ళిపోయి మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు (Nagababu) రిఫరెన్స్ తో జీ తెలుగులో ప్రసార‌మ‌య్యే కామెడీ షో ‘అదిరింది’ లో చేరాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘కామెడి స్టార్స్’ లో కూడా మెరిసాడు. కాగా ఆర్‌పీ ఇటీవలే యూట్యూబ్‌ చానల్‌ మొదలు పెట్టాడు. ఇందులో మొట్టమొదటగా హోమ్‌ టూర్‌ వీడియో చేశాడు. 

కిరాక్ ఆర్పీ నిశ్చితార్థంలో ధ‌న‌రాజ్ కుటుంబ స‌భ్యులు (Kirrak RP)

అందులో లిఫ్ట్‌, హోం థియేటర్‌.. ఇలా అన్నింటినీ చూపించిన ఆర్పీ తన బెడ్‌రూమ్‌లోని ఓ అమ్మాయి ఫొటో చూపించి ఆమె తనకు కాబోయే భార్య అని జనాలకు పరిచయం చేశాడు. కాగా, ఈ నిశ్చితార్థానికి (Engagement) నటుడు ధనరాజ్‌ కుటుంబ సమేతంగా హాజరై వారిని ఆశీర్వదించాడు. 

ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను సోష‌ల్ మీడియాలో (Social Media) షేర్‌ చేస్తూ మరోసారి శుభాకాంక్షలు చెప్పాడు. ఆయ‌న‌తో పాటు పలువురు కమెడియన్లు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. లక్ష్మీ ప్రసన్న నెల్లూరులో ఈవెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసిందట. ప్రస్తుతం ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!