పెళ్లి గురించి హాట్ యాంకర్ శ్రీముఖి (Anchor Sreemukhi) ఆసక్తికర సమాధానం!
బుల్లితెరపై అందంతో, అల్లరితో సందడి చేస్తున్న లేడీ యాంకర్లలలో శ్రీముఖి (Anchor Sreemukhi) కూడా ఒకరు. బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి ఇప్పటివరకు ఎన్నో షోలకు, ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించింది. తన అందంతో , యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. తన కెరీ ర్ ప్రారంభించిన తొలినాళ్లలో అదుర్స్ షో ద్వారా శ్రీముఖి ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో టీవీ షో లకి యాంకర్ గా వ్యవహరించింది. యాంకర్ గా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో కీలక పాత్రలు పోషించి మంచి నటిగానూ గుర్తింపును సంపాదించుకుంది.
అయితే, ప్రస్తుతం బుల్లితెర మీద యాంకర్ గా చలామణి అవుతున్న ఆడవాళ్లలో రష్మి (Rashmi), శ్రీముఖి (Anchor Sreemukhi) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో ఉన్నారు. అప్పుడప్పుడు వీరి పెళ్ళి గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా ప్రేక్షకులతో షేర్ చేస్తూ.. తన అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ వారు అడిగే ప్రశ్నలకు కూడా శ్రీముఖి సమాధానాలు ఇస్తుంది.
ఈ క్రమంలో సోషల్ మీడియా (Social Media) ద్వారా నెటిజెన్స్ ఒక్కోసారి శ్రీముఖి ఇబ్బంది పెట్టే విషయాల గురించి కూడా ప్రస్తావిస్తుంటారు. ఇందులో భాగంగానే ఓ సోషల్ మీడియా యూజర్ శ్రీముఖి పెళ్లికి సంబంధించిన విషయం గురించి ఓసారి ప్రస్తావించారు. దీనికి శ్రీముఖి సమాధానం ఇస్తూ “ఏమో సర్ నాకు ఇంట్రెస్ట్ పోయింది” అంటూ జవాబిచ్చింది. ఇలా ప్రతిసారీ తన పెళ్లి గురించి అడగటంతోనే శ్రీముఖికి చిరాకు వచ్చి ఇలా ఆసక్తికర సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం పెళ్లి గురించి శ్రీముఖి చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల శ్రీముఖి (Anchor Sreemukhi) బరువు తగ్గారు. కొంత మంది వెయిట్ లాస్ టిప్స్ అడగటంతో ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ చేశానని చెప్పారు. అంటే... ఉపవాసం ఉండటం అన్నమాట. ''రోజుకు పదహారు గంటలు ఉపవాసం ఉండి, మిగతా ఎనిమిది గంటల్లో మాత్రమే తిన్నాను అంటూ చెప్పుకొచ్చింది. జంక్ ఫుడ్, డ్రింక్స్, షుగర్స్ అవాయిడ్ చేశానని పేర్కొంది. ఇక, యూట్యూబ్ లోనూ ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ కి సంబంధించి వీడియోస్ ఉన్నాయి చూడండి అంటూ నెటిజన్స్ కు సూచించింది. అయితే... ఫాస్టింగ్ స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా న్యూట్రిషినిస్ట్ ని కలవండి అని శ్రీముఖి పేర్కొన్నారు.