బ్రేకప్ తర్వాత ఒకే స్టేజిపై కలిసిన షణ్ముఖ్-దీప్తి (Shanmukh Jaswanth-Deepthi Sunaina).. మళ్లీ కలవబోతున్నారా?

Updated on Oct 10, 2022 12:50 PM IST
ఇన్ఫినిటీయం మీడియా (Infinitum Media Event) సంస్థ యూట్యూబ్ క్రియేటర్స్ డేని వైజాగ్ లో ఘనంగా నిర్వహించింది.
ఇన్ఫినిటీయం మీడియా (Infinitum Media Event) సంస్థ యూట్యూబ్ క్రియేటర్స్ డేని వైజాగ్ లో ఘనంగా నిర్వహించింది.

సోషల్ మీడియాలో దీప్తి సునయనా-షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth-Deepthi Sunaina) చాలా పాపులర్ జోడి. వీరిద్దరూ యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, డాన్స్ వీడియోలతో చాలా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో మోస్ట్ రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. అయితే, షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత వీరిద్దరికీ బ్రేకప్ అయింది. 

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ కు సిరి హన్మంతుతో (Siri Hanmanthu) ఎఫైర్ కారణంగా ఈ రొమాంటిక్ కపుల్ బ్రేకప్ వరకు వెళ్లిపోయారు. వీరిద్దరూ బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో చాలా రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే... చాలా కాలం తర్వాత షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన ఒకే వేదికపై కనిపించారు. వైజాగ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో వీరిద్దరూ సందడి చేశారు. పక్కనే కూర్చున్న దీప్తిని చూస్తూ షణ్నూ సిగ్గుపడుతున్న క్లిప్పింగ్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. తాజాగా ఇన్ఫినిటీయం మీడియా (Infinitum Media Event) సంస్థ యూట్యూబ్ క్రియేటర్స్ డేని వైజాగ్ లో ఘనంగా నిర్వహించింది. ఈ ఈవెంట్ కి ఆ మీడియా సంస్థలో పనిచేసే యూట్యూబర్స్ అంతా వచ్చారు. ఇందులో భాగంగానే వైజాగ్ లో జరిగిన ఈ ఈవెంట్ కి దీప్తి సునయనా, షణ్ముఖ్ జశ్వంత్ ఇద్దరూ కూడా వచ్చారు.

ఈ కార్యక్రమంలో షణ్ముఖ్.. దీప్తి (Deepthi Sunaina) గురించి మాట్లాడుతూ.. మొదట్లో దీప్తి, నేను కవర్ సాంగ్ చేసే సమయంలో ఆమెపై చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వెనకడుగు వేయలేదు.. నేను దీప్తిని చూసి చాలా నేర్చుకున్నాను.. అలాగే అమ్మాయిలు ఆమెను చూసి నేర్చుకోవాలి. మీరు కూడా ఇతరులకు ఆదర్శవంతంగా నిలవాలి అంటూ షణ్ముఖ్ (Shanmukh Jaswanth)… ఈ కార్యక్రమంలో దీప్తి సునాయాయాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో వీరిద్దరూ మళ్ళీ కలిస్తే బాగుండు అనే ఆశ అందరిలో చిగురిస్తోంది.

Read More: లగ్జరీ కారు కొన్న స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth).. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గట్లేదుగా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!