లగ్జరీ కారు కొన్న స్టార్ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth).. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గట్లేదుగా!

Updated on Oct 13, 2022 12:16 PM IST
తాజాగా షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) ఓ ఖరీదైన కారును కొనడం ప్రస్తుతం సంచలనంగా మారింది. షణ్ముఖ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొన్నాడు.
తాజాగా షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) ఓ ఖరీదైన కారును కొనడం ప్రస్తుతం సంచలనంగా మారింది. షణ్ముఖ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొన్నాడు.

సోషల్ మీడియా స్టార్ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పలు వెబ్ సిరీస్ ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన షణ్ముఖ్ బిగ్ బాస్ షోలో సైలెంట్ గా ఉండటంతో పాటు సిరితో క్లోజ్ గా ఉండటం ద్వారా విమర్శల పాలయ్యాడు. దీని కారణంగా తన ప్రియురాలు దీప్తి సునయనతో సైతం బ్రేకప్ చేసుకోవాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే.. తాజాగా షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) ఓ ఖరీదైన కారును కొనడం ప్రస్తుతం సంచలనంగా మారింది. షణ్ముఖ్ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొన్నాడు. ఆయన కొనుగోలు చేసిన కారు దాదాపు రూ.51లక్షలు అని తెలుస్తోంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ ను షణ్ముఖ్ జశ్వంత్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

దసరా పండుగ వేళ కొత్త కారు పక్కనే షణ్ముఖ్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతటి లగ్జరీ కార్ (Shanmukh Jaswanth Luxurious car) కొన్నా షణ్ముఖ్ జస్వంత్  స్టార్ హీరోల ప్లేస్ లోకి యాడ్ అయిపోయారు. మరికొందరైతే ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లో యంగ్ హీరోలు కూడా ఇంత ఖరీతైన కారు కొనలేదు నీ ముందు వాళ్లు కూడా వేస్ట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

మరోవైపు షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) సినిమాలలో కూడా నటించి సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ మళ్లీ కలవాలని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక, షణ్ముఖ్ జశ్వంత్ కు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయన తన తర్వాతి ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో అనేది చూడాల్సి ఉంది.

Read More: Agent Anand Santosh Trailer: 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' ట్రైలర్ రిలీజ్.. అదరగొట్టిన షణ్ముఖ్ జస్వంత్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!