బ్రేకప్ తర్వాత ఒకే స్టేజిపై కలిసి కనిపించనున్న షణ్ముఖ్ (Shanmukh Jaswanth), దీప్తి సునయన
యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, సోషల్ మీడియా ద్వార ఫేమస్ దీప్తి సునయనా జంట అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీలు. వీరిద్దరూ కూడా కూడా ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మాజీ పోటీదారులు. షణ్ముఖ్ జస్వంత్ గతేడాదిలో జరిగిన ఐదవ సీజన్ లో పాల్గొనగా.. దీప్తి రెండవ సీజన్ బిగ్ బాస్ లో పాల్గొన్నారు. అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో.. దీప్తి సునయనా, షణ్ముఖ్ కొన్ని అపార్థాల కారణంగా అధికారికంగా విడిపోయారు.
ఆ తర్వాత వీరిద్దరూ ఒకరినొకరు చూడలేదు. ఏ షోలోనూ కలిసి కనిపించిందిలేదు. ఈ నేపథ్యంలో దీప్తి-షణ్ముఖ్‌లను ఒక్కసారైనా కలిసి చూడాలని వారిద్దరి అభిమానులూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ ఎదురు చూసేరిలో మీరూ ఉంటే గనుక, మా వద్ద వారి గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఇక్కడ ఉన్నాయి. నేడు జరగనున్న బిగ్ బాస్ తెలుగు OTT ఫ్యామిలీ ఎపిసోడ్‌లో వారిద్దరూ కనిపించే అవకాశం ఉన్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరితో పాటు పలువురు మాజీ కంటెస్టెంట్లు కూడా ఈ ఈవెంట్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.
అయితే బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ దక్కించుకున్న వారు కొందరైతే.. ఉన్న క్రేజ్‌ని పోగొట్టుకున్న వాళ్లూ ఈ లిస్టులో ఉన్నారు. గత సీజన్ లో పాల్గొన్న షణ్ముఖ్, సిరి హనుమంత్‌లు ఈ కోవలోకే వస్తారు. బయట ఆల్రీడీ వీరికి సపరేట్ గా ప్రేమికులు ఉన్నా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వీరే ప్రేమికులుగా మారడంతో ఇద్దరిపై విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. దీంతో విన్నర్ కావాల్సిన షణ్ముఖ్ బిగ్ బాస్ టైటిల్‌కి దూరం అయ్యాడు.
ఇక, సిరి హనుమంత్ అయితే హగ్ బేబీగా నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. బిగ్ బాస్ కి వెళ్లకముందు షణ్ముఖ్.. దీప్తి సునయనతో లవ్‌లో ఉండగా.. సిరి-శ్రీహాన్‌తో రిలేషన్‌లో ఉంది. ఇక, చివరి సీజన్లో వీరిద్దరూ హౌస్ లోకి చాలా క్లోజ్ అయ్యారు. ఎంతలా అంటే ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంతగా తెలుగు బిగ్ బాస్ హౌస్ చరిత్రలోనే రొమాంటిక్ జోడీగా మారారు. ఈ కారణంతోనే బిగ్ బాస్ షో ముగిసిన వెంటనే దీప్తి.. షణ్ముఖ్‌ని వదిలేసినట్లు తెలుస్తోంది.
అయితే, సిరి కూడా శ్రీహాన్‌కి దూరం అయినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు శ్రీహాన్, సిరి, షణ్ముఖ్‌లు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆ వార్తలకు చెక్ పడినట్లయింది. ఈ ముగ్గురూ ‘క్విక్ ఫిక్షన్’ (Quick Fiction) అనే సిరీస్‌పై కలిసి పనిచేస్తున్నారు.