Anchor Suma: 'క్యాష్' షో లో యాంకర్ సుమపై సెటైర్లు.. అలిగి వెళ్లిపోయిన ఆకాష్ పూరి.. ప్రోమో వైరల్ !

Updated on Jul 06, 2022 08:25 PM IST
'క్యాష్' షో పోస్టర్ (Cash Show Poster)
'క్యాష్' షో పోస్టర్ (Cash Show Poster)

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ (Anchor Suma) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సుమ బుల్లితెరపై తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది. దశాబ్దాలు గడుస్తున్నా, చెక్కు చెదరని ఫాలోయింగ్‌తో ముందుకు వెళ్తోంది.

బుల్లితెర, వెండితెర పై ఏ ఈవెంట్లో చూసినా 'సుమ కనకాల' పేరే వినిపిస్తూ ఉంటుంది. ఎంతో మంది యాంకర్లు వచ్చినా, అందాలు ఆరబోసినా, కొత్త కొత్త అందాల భామలు వస్తున్నా కూడా.. యాంకరింగ్‌లో మాత్రం సుమను 'ఢీ' కొట్టలేకపోతోన్నారు. సుమ స్థానం ఎప్పటికీ పదిలంగానే ఉంటూ వస్తోంది.

కాగా, తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటాయి. తద్వారా భారీ స్థాయిలో రేటింగ్‌ను కూడా దక్కించుకుంటున్నాయి. ఇలా సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుంటూ దూసుకుపోతున్న షోలలో 'క్యాష్' (Cash Show) ఒకటి.

ప్రతి శనివారం కొత్త కొత్త సెలబ్రిటీలను తీసుకుని వచ్చి  సందడి చేస్తూ ఉంటుంది యాంకర్ సుమ. ఆమె షోకు వస్తే గెస్టుల మీద పంచుల మీద పంచులు పడుతూనే ఉంటాయి. 

ఆ క్యాష్ షోకు కొంత మంది రెగ్యులర్ గెస్టులుంటారు. జబర్దస్త్ (Jabardasth Show) ఆర్టిస్టులు, సమీర్, బ్రహ్మాజీ వంటి వారు నిత్యం ఆ షోకు గెస్టులుగా వస్తుంటారు. ఈ మధ్య 'క్యాష్ షో'నూ సినిమా తారలు ప్రమోషన్ల కోసం వాడేస్తున్నారు. గత వారం విడుదలైన 'చోర్ బజార్' టీం సభ్యులు తాజాగా 'క్యాష్ షో'కు గెస్టులుగా వచ్చారు. ముఖ్యంగా హీరో ఆకాష్ పూరి, హీరోయిన్ గెహ్నా సిప్పి, ఆర్టిస్టులు రచ్చ రవి, ఇమాన్యుయేల్ వంటి వారు ఈ షోలో సందడి చేశారు.

ఇందులోని గెస్టులను ఈ సీనియర్ యాంకర్ తనదైన శైలి టైమింగ్‌తో ముప్పతిప్పలు పెట్టేసింది. 'క్యాష్' షోలో భాగంగా గెస్టులుగా వచ్చిన 'చోర్ బజార్' టీమ్ సభ్యులను సుమ ఓ ఆట ఆడించింది. అదే సమయంలో వాళ్లు కూడా ఆమెపై పంచులు వేశారు.

మరీ ముఖ్యంగా ఇందులో 'జబర్ధస్త్' కమెడియన్ ఇమాన్యూయేల్ (Comedian Immanuel) ఒక డిఫెరెంట్ గెటప్‌లో నటించిన తీరు తెగ నవ్వించింది. ఈ కమెడియన్ రెచ్చిపోతూ సుమపై పంచుల వర్షం కురిపించాడు. సుమ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇమ్మాన్యుయేల్ పై వరుస పంచులు వేస్తూ ఎంట్రీ ఇవ్వడంతోనే ఓ చెక్కను బహుమతిగా ఇచ్చి సెటైర్ వేసింది. 

ఇక, ఈ షోలో భాగంగా ఆకాశ్ పూరీకి (Akash Puri) హీరోయిన్‌తో సెల్ఫీ తీసుకునే టాస్క్ ఇచ్చింది. ఇదే టాస్క్‌లో రచ్చ రవి, ఇమాన్యూయేల్ బౌన్సర్లుగా యాక్ట్ చేశారు. ఆ సమయంలో ఆకాశ్‌ గెహనాతో సెల్ఫీ తీసుకోకుండా వాళ్లిద్దరూ ప్రయత్నిస్తారు. ఇక, చివర్లో సుమ వచ్చి 'సెల్ఫీ' అనగానే ఇమాన్యూయేల్ 'పాపం ముసలావిడ సెల్ఫీ కోసం వెయిట్ చేస్తుంది' అంటాడు.

ఆ మాటతో సుమకి ఎక్కడో కాలిపోయినట్టు అయ్యి, ఇమ్మాన్యుయేల్ ఫోన్ లాక్కుని.. కిందకు విసిరేస్తుంది. 'వద్దు' అంటూ ఇమ్మాన్యుయేల్ పరిగెత్తుకుంటూ వచ్చినా ఏ మాత్రం లాభం లేకుండా పోతుంది. ఆ ఫోన్‌ విరిగిపోతుంది. మొత్తానికి అది డమ్మీ ఫోనా?లేదా ఒరిజినల్ ఫోనా? అన్నది తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా వచ్చిన ప్రోమోలో (Cash Promo) యాంకర్ సుమ.. ఆకాశ్ పూరీకి హీరోయిన్ గెహనాకు ప్రపోజ్ చేసే టాస్కును ఇచ్చింది. ఇందులో అతడు చక్కగా నటించాడు. కానీ, ఆమె మాత్రం దీనికి రెస్పాన్స్ కానట్లు నటించింది. ఆ తరువాత గెహనాకు కూడా ఓ టాస్క్ ఇచ్చింది. ఇందులో గెలిస్తే తన ప్రశ్నకు జవాబు చెప్పక్కర్లేదని, గెలవకపోతే మాత్రం ఆన్సర్ చేయాలని సుమ కండీషన్ పెట్టింది.

గెహనా సిప్పీ సుమ ఇచ్చిన టాస్కులో ఓడిపోతుంది. దీంతో 'నీకు వీళ్లిద్దరిలో ఎవరితో చేయడం కంఫర్టుగా ఉంది' అని సుమ అడుగుతూ.. చోర్ బజార్ హీరో ఆకాశ్, డైరెక్టర్ జీవన్ రెడ్డి పేర్లను ఆప్షన్స్‌గా చెబుతుంది. దీనికి గెహనా డైరెక్టర్‌ పేరును జవాబుగా చెప్పడం గమనార్హం. దీనికి బాధపడ్డ ఆకాశ్ పూరీ షో నుంచి బయటకు వెళ్లిపోవడంతో.. ఆశ్చర్యపోవడం అందరి వంతవుతుంది. కాగా, ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More: Shanmukh Jaswanth: 'ఏజెంట్ ఆనంద్ సంతోష్'గా రాబోతున్న షణ్ముఖ్ జస్వంత్.. అదరగొడుతున్న ఫస్ట్ లుక్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!