బిగ్ బాస్ నాన్ స్టాప్ (Bigg Boss Nonstop): ఈ వారం డబుల్ ఎలిమినేషన్?
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ డిస్నీప్లస్ హాట్ స్టార్ లో మొదలై ఇప్పటికే 8 వారాలు పూర్తయింది. ప్రస్తుతం 9వ వారం జరుగుతోంది. ఇప్పటివరకు 8మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా.. ఈ వారానికి జరిగిన నామినేషన్ ప్రక్రియలో మొత్తం ఏడు మంది నామినేట్ అయ్యారు. వారిలో అనిల్, అరియానా, బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మ, యాంకర్ శివ, హమీదా ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ వారం డబుల్ నామినేషన్ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఎలిమినేట్ కాబోయే ఆ ఇద్దరు ఇంటి సభ్యులు ఎవరనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. ఇప్పటివరకు వచ్చిన అనధదికార ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓటింగ్ మిత్రా శర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభమైన మొదట్లో వీక్ గా కనిపించిన మిత్రా ప్రస్తుతం టాస్కులలో అదరగొడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. ఇక, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాంకర్ శివ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. హౌస్ లో ఫన్ జనరేట్ చేస్తున్న బాబా భాస్కర్ మూడో స్థానంతో సేఫ్ జోన్ లో ఉన్నాడు.
ఇక, మిగిలిన నలుగురిలో నటరాజ్ మాస్టర్ కిల్లర్ టాస్క్ బాగానే పర్ఫార్మ్ చేయడంతో ఆయన ఈ వారం ఎలిమినేషన్ నుంచి గట్టెక్కే అవకాశముంది. హమీదా నిలకడగా ఆడుతుండడంతో ఆమె కూడా సేఫ్ జోన్ లో ఉంది. ఇక, చివరకు మిగిలిన అనిల్, అరియానాలలో ఇద్దరూ లేదా ఒక్కరైనా ఈ వారం ఎలిమినేట్ కావొచ్చు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ జరిగితే అనిల్ బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరో.. తప్పించుకునేదెవరో ఈ ఆదివారం ఎపిసోడ్ లో తెలియనుంది.