Zee Telugu Kutumbam Awards 2022 : "జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022:: అక్టోబ‌ర్ 16 తేదీన బుల్లితెర ప్రేక్ష‌కులకు పండుగ

Updated on Oct 15, 2022 04:15 PM IST
అక్టోబ‌ర్ 16 తేదీన సాయంత్రం 5:30 గంటలకు "జీ తెలుగు" ఛాన‌ల్‌ (Zee Telugu) లో... "జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022" కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయ‌నున్నారు.
అక్టోబ‌ర్ 16 తేదీన సాయంత్రం 5:30 గంటలకు "జీ తెలుగు" ఛాన‌ల్‌ (Zee Telugu) లో... "జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022" కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయ‌నున్నారు.

Zee Telugu Kutumbam Awards 2022 : బుల్లితెరపై వినోదం అందిస్తూ కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ఛాన‌ల్‌"జీ తెలుగు" (Zee Telugu). అనేక కుటుంబ ధారావాహికలతో పాటు,  వినూత్నమైన రియాలిటీ షోలతో ఈ ఛానల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ప్ర‌తీ ఏటా అత్యంత ప్ర‌తీష్టాత్మ‌కమైన రీతిలో "జీ తెలుగు" ఛాన‌ల్‌ ఆధ్వర్యంలో ఉత్తమ నటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందివ్వడం విశేషం.

"జీ తెలుగు కుటుంబం అవార్డ్స్‌" పేరుతో అందించే ఈ పురస్కారాలు ఎందరో కొత్త నటుల్లో సైతం సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ సంవ‌త్స‌రం కూడా రెట్టింపు ఉత్సాహంతో ఈ పురస్కారాల వేడుకను నిర్వహించింది "జీ తెలుగు". 

అక్టోబ‌ర్ 16 తేదీన సాయంత్రం 5:30 గంటలకు "జీ తెలుగు" ఛాన‌ల్‌లో... "జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022" కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయ‌నున్నారు. ఈ వేడుకలో బుల్లితెర‌తో పాటు వెండితెర తార‌లు చేసిన సంద‌డిని ప్రేక్షకులు త‌ప్ప‌కుండా చూడాల్సిందే.

అక్టోబ‌ర్ 16 తేదీన సాయంత్రం 5:30 గంటలకు

రెడ్ కార్పెట్‌పై తార‌ల సంద‌డి
"జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022" (Zee Telugu Kutumbam Awards 2022) కార్య‌క్ర‌మంలో యాంక‌ర్లుగా శ్రీముఖి, సుధీర్‌ల‌తో పాటు ప్రదీప్ కూడా త‌మ‌దైన శైలిలో అద‌ర‌గొట్టారు. జీ తెలుగు కుటుంబ సభ్యులతో పాటు వెండితెర తార‌లు కూడా ఈ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై సంద‌డి చేశారు.

అంజలి, లక్ష్మి రాయ్, నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి, బాబు మోహన్, సాయి కుమార్, సోహెల్, తేజ సజ్జ, శ్రీనివాస్ రెడ్డి, నిహారిక కొణిదెల, ఎస్తర్, శివ బాలాజీ, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె, దర్శకులు బోయపాటి శ్రీను, మారుతి, తేజ, మల్లిడి వ‌శిష్ట, స్మిత‌ ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. 

ఉత్త‌మ న‌టన‌కు పుర‌స్కారాలు
ఉత్త‌మ సీరియ‌ల్, ఉత్త‌మ కుటుంబం, ఉత్త‌మ క‌థానాయ‌కుడు, ఉత్త‌మ క‌థానాయ‌కి, ఉత్త‌మ భ‌ర్త‌, ఉత్త‌మ భార్య‌, ఉత్త‌మ కొడుకు, ఉత్త‌మ కోడ‌లు, ఉత్త‌మ అత్త, గ‌డ‌స‌రి అత్త సొగ‌స‌రి కోడ‌లు, ఉత్త‌మ కూతురు, రొమాంటిక్ క‌పుల్, ఉత్త‌మ భార్య‌భ‌ర్త‌లు.. ఇలా వివిధ కేట‌గిరీల్లో నిర్వాహకులు అవార్డులను అందించారు. 

షోలో హైలెట్స్
హీరోయిన్లు అంజలి, లక్ష్మి రాయ్‌ల డాన్సులు "జీ తెలుగు కుటుంబం అవార్డ్స్‌"లో హైలెట్‌గా నిలిచాయి. ఇక బుల్లితెర అత్తా కోడ‌ళ్ల డాన్సులైతే ప్రేక్షకులను అమితంగా అలరించాయి. డాన్స్ ఇండియా డాన్స్"  కంటెస్టెంట్స్ సైతం ప్రత్యేక నృత్యాలతో కార్యక్రమాన్ని హోరెత్తించారు.

ఇక "జీ స‌రిగ‌మ‌ప" విన్న‌ర్ శృతికతో పాటు సింగ‌ర్స్  ప్రణవ్‌ కౌశిక్‌, సాయిశ్రీ చ‌ర‌ణ్, అర్జున్ విజ‌య్ ఈ కార్య‌క్ర‌మంలో తమ పాటలతో శ్రోతలను అల‌రించారు. అలాగే "జీ తెలుగు"లో ఎన్నో ఏళ్ళ నుండి తమ నటనా ప్రస్థానాన్ని  కొన‌సాగించిన సీనియర్  న‌టీన‌టుల‌ను ఈ వేడుకలో సంస్థ ప్రతినిధులు ఘనంగా స‌త్క‌రించారు. అలాగే ఈ వేడుకలో కొందరు న‌టీన‌టుల భావోద్వేగభరిత ప్రసంగాలు పలువురిని ఆక‌ట్టుకున్నాయి.

Read More: Zee Telugu : జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022 : అక్టోబ‌ర్ 9న ప్ర‌సారమయ్యే మెగా ఈవెంట్.. 'కిరాక్ పార్టీ'లో సందడి చేసిన తార‌లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!