బిగ్ బాస్ (BiggBoss Nonstop) లో యాంక‌ర్ శివ మాట‌ల‌కు ఎమోష‌న‌ల్ అయిన బిందుమాధ‌వి!

Updated on May 06, 2022 02:43 PM IST
యాంక‌ర్ శివ, బిందుమాధ‌వి (Bindu Madhavi, Anchor Shiva)
యాంక‌ర్ శివ, బిందుమాధ‌వి (Bindu Madhavi, Anchor Shiva)

తెలుగులో తొలిసారిగా ప్రారంభ‌మైన బిగ్ బాస్ నాన్ స్టాప్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకు ద‌గ్గ‌ర్లో ఉంది. దీంతో గ‌త కొద్ది రోజులుగా ఈ షో ఎంతో ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం హౌస్‌మేట్స్‌ మధ్య టఫ్‌ ఫైట్ జ‌రుగుతోంది. ఎలిమినేషన్‌ నుంచి గట్టెక్కించే ఈ ఆయుధమైన ఈ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ ను బిగ్‌బాస్‌.. హౌస్ లోని కంటెస్టెంట్లకు అంత ఈజీగా ఇస్తాడా? ఛాన్సే లేదు. 

అందుకే నానా టాస్క్‌లు ఆడిస్తూ ఇంటి స‌భ్యుల‌లో మరింత పట్టుదలను పెంచుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా యాంకర్‌ రవి హౌస్‌లోకి అడుగుపెట్టాడు. వెంట‌నే ఎవిక్షన్‌ ఫ్రీ పాస్ ప్ర‌థ‌మ‌ పోటీదారుడిగా యాంకర్‌ శివను ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ఆనందం శివకు ఎంతోకాలం నిలవలేదు. 

ర‌వి నుంచి యాంకర్ శివ‌ అందుకున్న బాక్స్‌లో తన అవకాశాన్ని వేరొకరికి బదిలీ చేయాలని రాసి ఉంది. దీంతో శివ.. త‌న స్నేహితురాలైన‌ బిందుమాధవి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం పోటీపడుతుందని ప్రకటించాడు. దీనికి కార‌ణంగా మూడు రోజుల నుంచి నువ్వు జీరో దగ్గరున్నావు.. ఆడు అని చెప్పాడు. దీంతో అస‌హ‌నానికి గురైన బిందు మాధ‌వి.. అంటే నేను ఆడలేదని ఇస్తున్నావా? నాకొద్దని తిరస్కరించింది. 

నేను సరిగా గేమ్ ఆడ‌ట్లేద‌ని నీకు అనిపిస్తుంది కదా అంటూ ఆమె ఏడుపు అందుకుంది. దీంతో శివ బిందును ఓదార్చాడు. కాసేపు బుజ్జగింపుల ప్రోగ్రాం అయ్యాక‌ బిందు.. ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కంటెండర్‌గా నిలిచేందుకు అంగీకరించింది. ఈ నేప‌థ్యంలో ఈ వారంలో ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కోసం ఇంకా ఎవరెవరు పోటీదారులుగా నిలుస్తారో తెలియాలంటే బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ చూడాల్సిందే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!