అవ‌కాశం ఇస్తామ‌ని చెప్పి అలా చేశారు.. బిగ్ బాస్ బ్యూటీ శ్వేతావ‌ర్మ‌కు (Sweta Varma) చేదు అనుభ‌వం

Updated on May 01, 2022 05:41 PM IST
 శ్వేతా వర్మ (BiggBoss Beauty Sweta Varma)
శ్వేతా వర్మ (BiggBoss Beauty Sweta Varma)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో సెట్ శ్వేతా వర్మ ( Sweta Varma) అందరికీ తెలిసిందే. సెట్ అంటూ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరితో పాజిటివ్ గా ఉండేది. ఆ సీజ‌న్ లో పాల్గొన్న యానీ మాస్ట‌ర్ అమ్మ అని పిలుస్తూ ఆమెతో బంధం పెంచుకుంది. కొన్ని సమయాలలో చాలా కోపంతో బరస్ట్ అయి సీజన్ ఫైవ్ లో ఆమె హైలెట్ అయింది.  

ఆ సీజ‌న్ అనంతరం పలు అవకాశాలు అందుకుంటూ.. టెలివిజన్ రంగంలో కూడా రాణిస్తోంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ… తన కెరీర్ గురించి అనేక విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటూ  ఉంటుంది. అయితే, తాజాగా ఈ అందాల తారకు ఓ చేదు అనుభవం ఎదురయింది. దాని గురించి వివ‌రిస్తూ సోష‌ల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ.  

చాలా బాధగా అనిపిస్తోంది. అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్కసారి కాదు. చాలాసార్లు.. ఈ రీతిగానే జరుగుతూ ఉంది. ఒక వ్యక్తికి ఆశ కల్పించి దానిని మళ్ళీ తీసేయడానికి… బాధగా ఉంది. బాధను అస్సలు భరించలేకపోతున్నాను. నాకు ఈ విధంగా ఆశలు కల్పించి వెంటనే ఆశలపై నీళ్లు చల్లడం ఎంత‌వ‌ర‌కు సమంజసం? అంటూ ప్ర‌శ్నించింది. ఇక‌, ఈ విధంగా జరగడం ఇదేమీ తొలిసారి కాదుంటూ వారం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పోస్ట్ చేసింది. అయితే, కొద్దిసేపటికే ఆ పోస్టులు తొలగించింది ఈ బ్యూటీ.

అయితే అప్ప‌టికే ఆ పోస్టుల‌ను చూసిన‌ ఆమె ఫాలోవర్స్ ఆమెకు బాస‌ట‌గా నిలిచారు. స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. యూనివర్స్ సిద్ధాంతాన్ని నమ్మే నువ్వు ఈ రీతిగా నెగిటివ్ గా ఉండకూడదు. ఏదైనా మంచికే అనుకోవాలి అని నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న‌ప్పుడే చెప్పావు. ఇలా నిరుత్సాహ పడకూడదంటూ ఆమెకు ఆమె అభిమానులు బాధపడకు అని రిప్లై ఇస్తున్నారు.


మ‌రోవైపు శ్వేత చేసిన ఆ పోస్టులు చూసిన వాళ్ళు  ఆ విషయం ఏంటని ఆరా కూడా తీస్తున్నారు. అసలు శ్వేతా కు వచ్చిన ఛాన్స్ ఏమిటి..? ఎవరు ఇచ్చారు..? వీటన్నింటికీ శ్వేత దగ్గరే సమాధానాలు ఉన్నాయి. అభిమానులకు అసలు విషయం ఏమిటో తెలియాలంటే బ్యూటీ నోరు విప్పాల్సిందే. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ షో లో ఎంటర్ అయిన వారు కొంతమంది బయటకు వచ్చాక వరుస అవకాశాలు సంపాదిస్తే మ‌రి కొంతమంది మాత్రం ముందు ఉన్న క్రేజ్ కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంత మంది మాత్రం ఎలా లోపలికి వెళ్లారో అలాగే బయటికి వస్తూ ఉంటారు అలాంటి వారిలో శ్వేత వర్మ ఒకరు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!