అషూ రెడ్డి (Ashu Reddy) జ‌ర్నీలో ఆ పాయింట్ మిస్ అయ్యిందా.. కార‌ణ‌మేంటి?

Updated on May 09, 2022 08:59 PM IST
అషూ రెడ్డి (Ashu Reddy)
అషూ రెడ్డి (Ashu Reddy)

తెలుగు బిగ్ బాస్ చ‌రిత్రలో తొలిసారిగా ఓటీటీ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) షో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ షో ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ‌కు చేరుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ షో 11వ వారం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప‌ద‌వ వారానికి గానూ బిగ్ బాస్ హౌస్ లో అషూరెడ్డి ప్ర‌యాణం ముగిసింది. అత్యంత నాటకీయంగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో చివరివరకూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లయిన‌ అరియనా, ఇంకా అషూ ఇద్దరూ డేంజ‌ర్ జోన్ లో ఉన్నారు. అరియానా ఎప్పటిలాగానే టెన్షన్ పడింది. అందుకే, అఖిల్ తో కాసేపు మాట్లాడింది. లాస్ట్ వీక్ చెప్పిందే నేను ఇప్పుడు నీకు చెప్తున్నా, గేమ్ బాగా ఆడు అంటూ అఖిల్ తో మాట్లాడింది. 

అలాగే, అషూ (Ashu Reddy) కూడా తనే ఎలిమినేట్ అవుతున్నానని ముందుగానే ఊహించింది. దీంతో అరియానా, అషూ రెడ్డి ఇద్దరిలో అషూ ఎలిమినేట్ అనగానే ఎలాంటి ఎమోషన్స్ లేకుండానే కూల్ గా స్టేజ్ పైకి వచ్చేసింది. హౌస్ లో ఉన్న మిగ‌తా కంటెస్టెంట్లు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ హోస్ట్ నాగార్జునతో స్టేజ్ షేర్ చేసుకుంది. అయితే, ఇక్కడే అషూ జెర్నీ చూపించాడు హోస్ట్ నాగార్జున. ఆ జ‌ర్నీలో అషూ ఎక్కువగా అల్లరి చేసింది. ఆ తర్వాత నామినేషన్స్ ఇష్యూ, అనంత‌రం టాస్క్ లు, ఎమోషన్ ఎప్పటిలాగానే జెర్నీని కట్ చేశారు. దీంతో ఆ వీడియోను చూసిన‌ అషూ రెడ్డి కొద్దిగా ఎమోషనల్ అయ్యింది. 

అయితే, అషూ (Ashu Reddy) జెర్నీలో ముఖ్య విష‌యాలైన‌ బాత్రూమ్ లో సిగరెట్ తాగిన విషయం, శివతో షర్ట్ గురించి గొడవ పడింది, కన్ఫెషన్ రూమ్ లో మాట్లాడింది ఇవేమీ చూపించక‌పోవ‌డం విశేషం. ఇక‌, జర్నీ చూసిన తర్వాత అషూరెడ్డి నాగార్జునతో ఒకటి మిస్ అయ్యిందంటూ నోరు జారి చెప్పేసింది. దీనికి కౌంట‌ర్ గా నాగార్జున మళ్లీ యాడ్ చేయమంటావా అంటూ సెటైర్ వేశారు. నువ్వు ఎలా చెప్తే అలా చేసేస్తారు అని అన్నాడు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్నది అషూ రెడ్డి. స్టేజీ పైనే ఇదే తగ్గించుకోవాలంటూ మాట్లాడింది. ఇక‌, జెర్నీ వీడియో అయిపోయిన తర్వాత అషూ హౌస్ మేట్స్ ని పలకరిస్తూ ఒక్కొక్కరికి ఒక్కో వెజిటబుల్ తో పాటు ఫ్రూట్ ఇచ్చింది. 

దానికి కారణాలు కూడా చెప్పింది అషూ. నటరాజ్ మాస్టర్ కి కొబ్బరి బోండాం, అరియానాకి మాంగో , అనిల్ కి క్యాబేజీ, శివకి వంకాయ ఇలా ఇస్తూ తనదైన స్టైల్లో హౌస్ కి వీడ్కోలు చెప్పింది అషూ. కాగా, మొత్తానికి ముందు పాల్గొన్న‌ సీజన్ 3 కంటే కూడా ఓటీటీలోనే అషూరెడ్డి కి మంచి పేరు వచ్చింది. గ‌త సీజ‌న్ కంటే కూడా ఈ సారి బెటర్ గేమ్ ఆడింది. ఇన్ని వారాలు హౌస్ లో ఉండి తను టాప్ 5కి ఆల్ మోస్ట్ చేరువైంది. గేమ్ లో చేసిన కొన్ని త‌ప్పులు, హౌస్ మేట్స్ తో వచ్చిన ఇష్యూలో లాజిక్స్ లేకపోవడం అనేది అషూ గేమ్ ని దెబ్బతీశాయనే చెప్పాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!