బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) ప‌దోవారంలో ఊహించని ఎలిమినేష‌న్.. ఆమె ఔట్?

Updated on May 08, 2022 04:14 PM IST
అషూరెడ్డి, అరియానా గ్లోరీ (Ariyana Glory, Ashu Reddy)
అషూరెడ్డి, అరియానా గ్లోరీ (Ariyana Glory, Ashu Reddy)

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్ షో (BiggBoss Nonstop) చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఈ షో మరో రెండు, మూడు వారాల్లో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు బుల్లితెరపైకి తొలి సారిగా ఈ నాన్ స్టాప్ షో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చింది. అనంత‌రం భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని సూపర్ డూపర్ హిట్ షోగా ఎదిగింది బిగ్ బాస్. గతంలో ఎన్న‌డూ చూడని కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. సరికొత్త టాస్కులు, ఊహించని సంఘటనలు, ఆసక్తిని కలిగించే ఎలిమినేషన్స్ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే పదో వారం కూడా షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలిస్తోంది.  

ఇప్ప‌టివ‌ర‌కు అందుతున్న సమాచారం ప్రకారం.. పదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియలో స్ట్రాంగ్ అండ్ పాపులర్ కంటెస్టెంట్ అషు రెడ్డి (Ashu Reddy) ఎలిమినేట్ అయినట్లు సమాచారం. గతంలో బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన ఈమె మధ్యలోనే ఎలిమినేట్ అయింది. ఇప్పుడు ఓటీటీ నాన్ స్టాప్ షో లో మాత్రం చివరి వరకూ వచ్చి షో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే, బిగ్ బాస్ నాన్ స్టాప్ (BiggBoss Nonstop) మొదటి సీజన్ ప్రారంభం నుంచీ ఎలిమినేషన్ షాకింగ్‌గానే జరుగుతోంది. దీంతో, ఈ వారం ఓటింగ్ ప‌రంగా అషు రెడ్డినే చివరి స్థానంలో కొనసాగింది. అయితే, ఈ సీజ‌న్ లో ప్ర‌తీ వారం చివ‌ర‌కు వ‌చ్చేస‌రికి ఫలితం మారుతుండడంతో ఆమె స్థానంలో మరొక కంటెస్టెంట్ బలవుతారని అంతా అనుకున్నారు. కానీ, అషూరెడ్డినే ఇంటినుంచి ఎలిమినేష‌న్ చేసి పంపేసినట్లు తెలిస్తోంది. ఇక, మ‌రో కంటెస్టెంట్ మిత్రా శర్మ ఈ వారం కూడా ఎలిమినేష‌న్ నుంచి గట్టెక్క‌డంపై అనుమానాలు వస్తూనే ఉన్నాయి.

కాగా, ప్రస్తుతం బిగ్ బాస్ (BiggBoss Nonstop) హౌస్‌లో అషూరెడ్డితో కలిపి తొమ్మిది మంది ఉన్నారు. వీరిలో యాంకర్ శివ, అరియానా, అషూ రెడ్డి, మిత్రా శర్మ, బిందు మాధవి, అఖిల్, అనిల్‌ నామినేషన్‌లో ఉన్నారు. ప్ర‌తీవారంలాగానే ఈ సారి కూడా ఓటింగ్‌లో అఖిల్‌, బిందు మాధ‌వి దూసుకుపోయారు. కాకపోతే ఈసారి బిందు కంటే అఖిల్‌కే ఎక్కువ ఓట్లు పడ్డట్లు సమాచారం అందుతోంది. ఆ తర్వాత మూడో స్థానంలో యాంకర్‌శివ ఉన్నాడు. ఇక‌, ఈ వారం అనూహ్యంగా మిత్ర శర్మకు ఓట్లశాతం పెరిగినట్లు సమాచారం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!