బిగ్ బాస్ ఓటీటీ తెలుగు (Bigg Boss OTT Telugu) : అజయ్ కతుర్వార్ (Ajay Kathurvar) ఎలిమినేషన్ పై మిశ్రమ స్పందనలు

Updated on Apr 25, 2022 04:30 PM IST
Ajay Kathurvar and Akkineni Nagarjuna
Ajay Kathurvar and Akkineni Nagarjuna

బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఓటీటీ (Bigg Boss Season 6) ద్వారా ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తెలుగు ప్రజలను బాగానే ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఎనిమిది వారాలు గడిచిపోయాయి. ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. 

ఈ ఆదివారం ఎపిసోడ్‌లో అక్కినేని నాగార్జున ఎంట్రీ సాంగ్ చాలా స్టైలిష్‌గా సాగింది. అలాగే ఎలిమినేట్ అయ్యే కంటెస్టంట్ ఎవరు? అనే అంశంపై కూడా వివిధ చర్చలు జరిగాయి. ముఖ్యంగా నామినేషన్ల బారిన పడిన హౌస్ మేట్స్ పై కూడా దీని ప్రభావం పడింది.

ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ .. లాంటి వేదికలలో కూడా ఎలిమినేట్ అయ్యేది ఎవరు? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నెటిజన్లు తమ అభిమాన కంటెస్టంట్లకు మద్దతుగా పోస్టులు చేశారు. ఈ క్రమంలో హమీదా లేదా అషురెడ్డి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. 

కానీ ఆశ్చర్యమైన రీతిలో అజయ్ కతుర్వార్ (Ajay Kathurvar) ఎలిమినేట్ అవ్వడం కొందరిని షాక్‌కు గురిచేసింది. అయితే అజయ్ ఎలిమినేట్ అయిపోయినా, ఎవరి మనసును గాయపరచకుండా చాలా మెచ్యూర్డ్‌గా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ముఖ్యంగా ఆయన ఎవరితోనూ వాదనకు దిగలేదు. ఎవరి మీదా నెగటివ్ వ్యాఖ్యలు చేయలేదు. అంతకు మించి, ఎవరినీ నొప్పించలేదు. నవ్వుతూనే బయటకు వచ్చేశాడు. మిస్టర్ పాజిటివ్‌గా నిలిచాడు. అజయ్ ఎలిమినేట్ అయ్యాక, ఇప్పుడు ఆ విషయంపై ప్రజలలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతనిని కొనియాడుతుంటే, మరికొందరు ఆయన ఎలిమినేషన్ ప్రక్రియను స్వాగతిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!