ఆహా(Aha) పాటల ముచ్చట్లు
ఆహా(Aha) ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ షో పాటలతో హుషారెత్తిస్తోంది. ఈ వారం గీతాంజలి పాటలతో గాయకులు చెలరేగిపోయారు. ఆహాలో తుళ్ళిన పాటల ముచ్చుట్లు.
చిత్రలహరి నుంచి ఇప్పటివరకు పాటల ప్రోగ్రామ్స్ ఏవైనా ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఆహా ఓటీటీలో వస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) షో ప్రతీ వారం సరి కొత్త పాటలతో అలరిస్తుంది. పన్నెండు మందిలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. షో హోస్ట్ శ్రీరామచంద్ర నిత్యామీనన్‌ను సైకిల్ పై ఎక్కించుకుని చక్కర్లు కొట్టారు. కానీ అది ఓ డ్రీమ్‌గా క్రియేట్ చేశారు.
తెలుగు ఇండియన్ ఐడల్‌లో గీతాంజలి నుంచి పాడిన పాట అందరినీ హుషారెత్తించింది. మొదటగా ప్రణతి ‘గీతాంజలి’లోని ‘జల్లంత కవ్వింత కావాలిలే… ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే’ గీతాన్ని పాడింది. ఈ పాట సరిగ్గా పాడలేదంటూ జడ్జీలు చెప్పటంతో ప్రణతీ షాక్ అయింది. ఆ తర్వాత అది సరదాగా అన్న మాటలని హ్యాపీగా ఫీల్ అయింది. ప్రణతి ట్రైనర్ నిహాల్ ను కూడా జడ్జీలు అభినందించారు.
చుక్కలు తెమ్మెన్నా .. అంటూ మారుతీ పాటకు అంత హిట్ అవలేదంటూ జడ్జీలు చెప్పారు. వాగ్దేవి కొంచెం నీరు కొంచెం నిప్పు.. పాట అదుర్స్ అని చెప్పారు. మాన్య పాడిన పాట జాణవులే… నెర జాణవులే నచ్చిందని చెప్పారు. అదితి భావరాజు రోజాలో లేత వన్నెలే’ పాటను పాడి ఆకట్టుకుంది. అదితిని జడ్జీలు పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ఆనంద బాష్పాలతో అదితి థాంక్స్ చెప్పింది. అదితినే విన్నర్‌గా నిలిచింది.