యూట్యూబ్‌(YouTube)లో హీరో నాని(Nani) కొత్త రికార్డు.

Updated on Apr 22, 2022 10:13 AM IST
 హోరో నాని న‌టించిన సినిమా యూట్యూబ్‌లో రికార్డు సాధించింది. ప‌ది కోట్లు వ‌సూళ్లు చేసింది. ల‌క్ష‌ల వ్యూస్‌తో రికార్డు సాధించిన నాని సినిమా వివ‌రాలేంటో తెలుసుకుందాం.

నాని, కీర్తీ సురేష్‌లు హీరో హీరోయిన్‌గా న‌టించిన సినిమా `నేను లోక‌ల్‌`. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై  నిర్మాత దిల్ రాజు నిర్మించారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. 2017 ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది.

`నేను లోక‌ల్‌` సినిమాను 18 కోట్ల రూపాయ‌ల‌తో తెర‌కెక్కించారు. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా చూస్తే రూ.50 కోట్ల కొల్ల‌గొట్టి హిట్ సాధించింది. ఈ మ‌ధ్య కాలంలో `నేను లోక‌ల్‌` సినిమానుయూట్యూబ్‌లో విడుద‌ల చేశారు.

యూట్యూబ్‌లో విడుద‌లైన `నేను లోక‌ల్‌` చిత్రం మిలియ‌న్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. వంద మిలియ‌న్ వ్యూస్‌ సొంతం చేసుకుంది. అత్య‌ధిక వ్యూస్ సంపాదించిన చిత్రంగా నిలిచింది. దీంతో హీరో నాని కొత్త రికార్డును సాధించారు. 

ప్ర‌స్తుతం నాని న‌టిస్తున్న`అంటే.. సుంద‌రానికీ!` త్వ‌రలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పంచెక‌ట్టుతో కొత్త లుక్‌లో నాని ఈ సినిమాలో క‌నిపిస్తున్నారు. మ‌రో సినిమా `ద‌స‌రా` కూడా త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!