ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ‘సీతారామం’ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

Updated on Sep 04, 2022 07:21 PM IST
దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) తెలుగులో డైరెక్ట్‌గా నటించిన మొదటి సినిమా సీతారామం
దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) తెలుగులో డైరెక్ట్‌గా నటించిన మొదటి సినిమా సీతారామం

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన సినిమా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన రిలీజై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదలైంది.

రష్మికా మందాన, సుమంత్ కీలకపాత్రల్లో నటించిన సీతారామం సినిమా రూ.40 కోట్ల గ్రాస్‌, రూ.80 కోట్ల గ్రాస్‌ను సాధించింది. వైజయంతీ మూవీస్ సమర్ఫణలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా స్వప్న సినిమా పతాకంపై సీతారామం సినిమాను నిర్మించారు.  

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) తెలుగులో డైరెక్ట్‌గా నటించిన మొదటి సినిమా సీతారామం

ఓటీటీలో ఎలా ఆదరిస్తారో మరి..

సీతారామం సినిమా ఓటీటీ విడుదలపై తాజా అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తికావడంతో ఓటీటీ విడుదలకు రెడీ అయ్యింది. థియేటర్‌‌లో మంచి ఆదరణ పొందిన సీతారామం సినిమాకు ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుంతో చూడాలి మరి.

హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాలో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకపోవడంతో కుటుంబ సమేతంగా సినిమాను చూస్తున్నారు ప్రేక్షకులు. దీంతో ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్‌ వస్తోంది. సీతారామం సినిమాకు అన్ని వైపులనుంచీ ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మృణాల్ ఠాగూర్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  

Read More : Dulquer Salman: దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లో మరో ఛాన్స్.. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో సినిమా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!