ఆ క్యారెక్టర్‌‌ కోసం ఎంత కష్టపడడానికైనా రెడీ : సీతారామం (Sitaramam) హీరోయిన్ మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur)

Updated on Aug 22, 2022 09:53 PM IST
సీతారామం (Sitaramam) సినిమాలో చీరకట్టుతో మెప్పించి కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకున్నారు హీరోయిన్ మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur)
సీతారామం (Sitaramam) సినిమాలో చీరకట్టుతో మెప్పించి కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకున్నారు హీరోయిన్ మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur)

హిందీలో వచ్చిన జెర్సీ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వక‌పోయినా.. సీతారామం (Sitaramam) సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). సీతారామం సినిమాలో ఈ బ్యూటీ సాంప్రదాయ చీర‌క‌ట్టులో కనిపించి అలరించారు.

తన అందం, అభిన‌యంతో కోట్లాది మంది మ‌న‌సు దోచేసింది మృణాళ్. ఈ బ్యూటీఫుల్ లేడీకి ఓ లెజెండ‌రీ న‌టి బ‌యోపిక్‌లో న‌టించాల‌ని ఉంద‌ట‌. సీతారామం సినిమా షూటింగ్ మొద‌లైన‌ప్పుడు అంద‌రూ మృణాళ్‌ ఠాకూర్‌ను లెజెండ‌రీ యాక్ట్రెస్ మ‌ధుబాలతో పోల్చడం మొద‌లుపెట్టారు.

సీతారామం (Sitaramam) సినిమాలో చీరకట్టుతో మెప్పించి కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకున్నారు హీరోయిన్ మృణాళ్‌ ఠాకూర్ (Mrunal Thakur)

త‌న‌ను మ‌ధుబాల‌తో పోల్చడం గౌర‌వంగా భావిస్తున్నానని చెప్పారు మృణాళ్ ఠాకూర్‌. ఐకానిక్ హీరోయిన్ మ‌ధుబాల పాత్ర పోషించ‌డం క‌ష్టమే అయినా.. ఆ క‌ష్టం ప‌డేందుకు (బ‌యోపిక్‌లో న‌టించడానికి) ఎదురుచూస్తున్నానని మృణాళ్‌ ఠాకూర్‌ చెప్పారు.

హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సీతారామం (Sitaramam) సినిమా స‌క్సెస్‌ను మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం మృణాళ్‌ (Mrunal Thakur) పిప్పా, ఆంఖ్ మిచోలి, గుమ్రా, పూజా మేరీ జాన్ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.

Read More : Dulquer & Mrunal: 'సీతారామం' (Sitaramam) సక్సెస్ మీట్ లో మెరిసిన దుల్కర్ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!