యశ్‌ (Yash) న్యూ లుక్‌ కేజీఎఫ్‌3 కోసమా?

Updated on Apr 25, 2022 06:02 PM IST
భార్య రాధికా పండిట్‌తో యశ్‌ (Yash)
భార్య రాధికా పండిట్‌తో యశ్‌ (Yash)

యశ్‌ (Yash)ను కేజీఎఫ్‌ సినిమా ఓవర్‌‌నైట్‌ స్టార్‌‌ హీరోను చేసేసింది. అయితే, ఆ సినిమా కోసం అతను పడిన కష్టం అంతా ఇంతా కాదు. అందులోని మాసీ లుక్‌ కోసం ఐదు సంవత్సరాలు గడ్డం పెంచాడంటే యశ్‌ కమిట్‌మెంట్‌ను అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా సెకండ్ పార్ట్​లో గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో రాఖా భాయ్‌గా యశ్‌ అభిమానులకు అలరించాడు. ఇన్ని సంవత్సరాలుగా కేజీఎఫ్‌ సినిమా కోసం పెంచుకున్న గడ్డాన్ని తీసేసి నయా లుక్‌లోకి వచ్చాడు యశ్‌.

తాజాగా తన భార్యతో కలిసి వెళ్లి హెయిర్‌‌ కటింగ్‌ చేయించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా గడ్డాన్ని కత్తెరతో కట్‌ చేసుకున్న యశ్‌.. తర్వాత ట్రిమ్మర్‌‌ సహాయంతో మరింత గడ్డాన్ని ట్రిమ్‌ చేసుకున్నాడు. అనంతరం హెయిర్‌‌ స్టైలిస్ట్​తో కటింగ్‌ చేయించుకున్న యశ్‌.. హ్యాండ్‌సమ్‌ లుక్‌లో కనిపించాడు. చాలాకాలంపాటు తన భర్తను గడ్డం, పొడవాటి జుట్టుతో చూసిన యశ్‌ భార్య రాధికా పండిట్‌ తన భర్త నయా లుక్‌ చూసి మురిసిపోయింది. ఇదంతా వీడియో తీసిన యశ్‌ టీమ్‌ దానిని సోషల్‌ మీడియాలో పెట్టారు. ఇక, యశ్‌ న్యూలుక్‌ చూసి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా, కేజీఎఫ్‌3 కోసం యశ్‌ కొత్త గెటప్‌లోకి మారాడని అనుకుంటున్నారు.  

ఇక, కేజీఎఫ్‌2 సక్సెస్‌ తర్వాత యశ్‌ వీడియో షేర్‌‌ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశాడు. అందులో ఒక కథను కూడా చెప్పాడు రాఖీ భాయ్. వాన కోసం ఎదురు చూసే ప్రజలు క‌లిసి పూజ‌లు చేయాల‌నుకుంటారు. అంద‌రూ ఒక ద‌గ్గరకి చేరుకుంటారు. ఓ పిల్లాడు మాత్రం గొడుగు తీసుకువ‌స్తాడు. ఎందుకంటే వ‌ర్షం ప‌డుతుంద‌నే న‌మ్మకం. అలాంటి న‌మ్మకంతోనే తాను ప్రేక్షకుల ముందుకు వ‌చ్చాన‌ని చెప్పిన యశ్‌  (Yash)... సినిమాను సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!