గౌతమ్ దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) సినిమా ఉన్నట్టా? లేనట్టా?
రామ్ చరణ్ (Ram Charan) ఆచార్య సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించనున్నారు. గౌతమ్ దర్శకత్వం నుంచి రామ్ చరణ్ తప్పుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. మెగా పవర్ స్టార్ ఆ గాసిప్స్‌పై క్లారిటీ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటించిన సినిమా ఆచార్య, ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఆచార్య తర్వాత రామ్ చరణ్ నెక్ట్ మూవీపై పలు గాసిప్ప్ వస్తున్నాయి.
గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా జెర్సీ సినిమా తీశారు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. అదే సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. కానీ హిందీ వెర్షన్ ఆడియన్స్‌కు అంత నచ్చలేదు. దీంతో గౌతమ్‌పై కూడా విమర్మలు వచ్చాయి.
ఇక రామ్ చరణ్ ... RRR, ఆచార్య సినిమాల తర్వాత, గౌతమ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. అలాగే శంకర్ దర్శకత్వంలో కూడా ఆయన ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ క్రమంలో అసలు ఇంతకీ చరణ్ తన తదుపరి ప్రాజెక్టుని గౌతమ్‌కి ఇస్తున్నారా లేదా అనే డౌట్ కూడా చాలా మందికి వచ్చింది. ఆ డౌట్‌కు చెక్ పెడుతూ రామ్ చరణ్ ఆన్సర్ ఇచ్చారు. ఎమోషన్, యాక్షన్ కలిసిన ఓ సినిమా చేస్తున్నానని.. దర్శకుడు గౌతమ్ డైరెక్షన్‌లో తాను నటిస్తున్నానని రామ్ చరణ్ చెప్పారు. దీంతో అభిమానులు అనుమానాలన్నీ తీరిపోయాయి.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టినా, రష్మికానా అనేది తెలియాల్సి ఉంది. శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) గౌతమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.