కొరటాల శివ (Koratala Siva) కథల్లో హీరోలెవరో?
రెబల్ స్టార్ ప్రభాస్‌ను క్లాస్ లుక్‌లో చూపిస్తూనే మాస్ స్టోరీని తెరకెక్కించి ‘మిర్చి’ మూవీతో సూపర్ హిట్ ఇచ్చాడు.. ‘శ్రీమంతుడు’లో సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, ‘భరత్ అనే నేను’ సినిమాలో యంగ్ సీఎంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబును ప్రేక్షకులకు దగ్గర చేశాడు.. ‘జనతా గ్యారేజ్’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కొత్తగా చూపిస్తూనే సామాజిక సేవ చేయాలనే సందేశాన్ని ఇవ్వడం ఆయన స్పెషాలిటీ. అందుకే కొరటాల శివ వంటి డైరెక్టర్‌తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోకూడదని అనుకుంటారు హీరోలు.
మెగాస్టార్ చిరంజీవితో కొరటాల శివ ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి తనయుడు మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. దీంతో కొరటాల తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. రాం చరణ్ హీరోగా సినిమా స్టార్ట్ కాబోతోందని ప్రకటన కూడా వెలువడినా, కొన్ని అనివార్య కారణాలతో ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది.
‘ఆచార్య’ షూటింగ్ పూర్తయినందున కొరటాల శివ తర్వాత సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్టు ప్రకటన వచ్చింది. అయితే ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమా కథకు చరణ్, బన్నీతో చేయాలనుకున్న సినిమాల కథలకు సంబంధం లేదని, కొత్త కథతోనే ఎన్టీఆర్‌తో కొరటాల సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, చరణ్, అల్లు అర్జున్‌లకు చెప్పిన కథలను ఏ హీరోలతో తెరకెక్కించబోతున్నారనేది తేలాల్సి ఉంది. ఇద్దరు మెగా హీరోలు వద్దనుకున్న కథల్లో హీరోలుగా ఎవరు నటిస్తారో చూడాలి మరి.