VIRATA PARVAM: విరాట ప‌ర్వంలో పోరు బిడ్డ‌గా వ‌స్తున్న కామ్రెడ్ ర‌వ‌న్న

Updated on May 07, 2022 02:59 PM IST
VIRATA PARVAM: రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి న‌టించిన సినిమా విరాట ప‌ర్వం సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. న‌క్స‌లిజం క‌థ‌తో విరాట‌ప‌ర్వం తెర‌కెక్కిస్తున్నారు.
VIRATA PARVAM: రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి న‌టించిన సినిమా విరాట ప‌ర్వం సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. న‌క్స‌లిజం క‌థ‌తో విరాట‌ప‌ర్వం తెర‌కెక్కిస్తున్నారు.

VIRATA PARVAM: రానా ద‌గ్గుబాటి, సాయి ప‌ల్ల‌వి న‌టించిన సినిమా విరాట ప‌ర్వం సినిమా త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. న‌క్స‌లిజం క‌థ‌తో విరాట‌ప‌ర్వం తెర‌కెక్కిస్తున్నారు. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

హీరో రానా ద‌గ్గుబాటిలో ఓ స్పెషాలిటీ ఉంది. రానా హీరోయిజం, విల‌నిజం రెండు చేయ‌గ‌ల స‌త్తా ఉన్న న‌టుడు. హీరోతో పాటు విలన్‌గా న‌టించి ప్రేక్ష‌కుల మొప్పు పొందాడు. బాహుబ‌లిలో రానా ద‌గ్గుబాటి చేసిన భ‌ల్లాల దేవ న‌ట‌న‌కు ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. బీమ్లా నాయ‌క్‌లో  రానా ప‌వ‌న్‌కు ప‌త్య‌ర్ధిగా న‌టించి మెప్పించారు. రానా న‌టించిన విరాట ప‌ర్వం (VIRATA PARVAM) సినిమా షూటింగ్ పూర్తి అయి చాలా రోజులు అవుతున్నా.. క‌రోనా కార‌ణంగా రిలీజ్ కాలేదు. 

VIRATA PARVAM

సాయి ప‌ల్ల‌వితో క‌ల‌సి రానా విరాట‌ప‌ర్వం (VIRATA PARVAM) సినిమాలో న‌టించారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంవ‌త్స‌రం దాటినా.. విడుద‌ల మాత్రం చేయ‌లేదు. క‌రోనా త‌ర్వాత అగ్ర హీరోల సినిమాల‌తో థియేట‌ర్లు బ్లాక్ అయ్యాయి.  దీంతో విరాట ప‌ర్వం రిలీజ్ లేట్ అయింది. ఎట్ట‌కేల‌కు విరాట ప‌ర్వం రిలీజ్ చేస్తున్నామంటూ అప్ డేట్ వ‌చ్చింది. జూలై 1న విరాట ప‌ర్వం సినిమాను విడుద‌ల చేస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్‌ రానా, సాయి ప‌ల్ల‌వి అభిమానుల‌కు గుడ్ న్యూస్‌గా మారింది.  

 

VIRATA PARVAM

విరాట ప‌ర్వం చాలా వాయిదాల త‌ర్వాత‌ జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో రిలీజ్ చేస్తార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాల్ జోరు అందుకున్నాయి. దీంతో విరాట ప‌ర్వం టీం ఈ సినిమాను థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. ఓటీటీలో రిలీజ్ చేయ‌మ‌ని క‌న్ఫామ్ చేశారు. కామ్రెడ్ ర‌వ‌న్న‌గా రానా న‌టిస్తున్నారు. భారతక్కగా ప్రియమణి యాక్ట్ చేస్తున్నారు. రవన్న రచనలకు ఫిదా అయ్యి అతడి కోసం అడవికి వెళుతుంది సాయిప‌ల్ల‌వి. అస‌లు రానాను క‌లుస్తుందా లేదా.. ఎలాంటి ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి. క్రామెడ్ ర‌వ‌న్న విరాట ప‌ర్వంలో చేసిన పోరాటాలపై సినిమా క‌థ ఉంటుంది.   

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!