ఈ అడ‌విలో వెలుగు ఎక్క‌డ, ఎప్పుడు అని నిర్ణ‌యించేది ప్ర‌కృతి కాదు.. నేను : విక్రమ్ ( Vikram) ట్రైలర్‌లో కమల్ హాసన్

Updated on May 22, 2022 06:45 PM IST
Vikram: క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)  న‌టించిన విక్ర‌మ్ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. తెలుగులో విక్ర‌మ్ ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేశారు. ప‌దా చూసుకుందాం అంటూ క‌మ‌ల్ హాస‌న్ ట్రైల‌ర్‌లో చెల‌రేగిపోయారు.
Vikram: క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)  న‌టించిన విక్ర‌మ్ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. తెలుగులో విక్ర‌మ్ ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేశారు. ప‌దా చూసుకుందాం అంటూ క‌మ‌ల్ హాస‌న్ ట్రైల‌ర్‌లో చెల‌రేగిపోయారు.

క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan)  న‌టించిన 'విక్ర‌మ్' సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయింది. తెలుగులో 'విక్ర‌మ్' ట్రైల‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ రిలీజ్ చేశారు. ప‌దా చూసుకుందాం.. అంటూ క‌మ‌ల్ హాస‌న్ ట్రైల‌ర్‌లో చెల‌రేగిపోయారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక, థియేట‌ర్ల‌లో విక్ర‌మ్ ఎలాంటి హిస్ట‌రీ క్రియేట్ చేస్తుందో అందరూ వేచి చూడాల్సిందే. 

'విక్ర‌మ్' సినిమా తెలుగు రైట్స్‌ను యువ నటుడు నితిన్ స్వీయ నిర్మాణ,సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకుంది. ఇదే క్రమంలో, ఈ సినిమా కోసం శ్రేష్ఠ్ మూవీస్ ప్రమోషన్స్ జోరును కూడా పెంచింది. తమ ప్రమోషన్స్‌లో భాగంగానే, రామ్ చ‌రణ్‌తో  సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయించింది. ఈ రోజే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్‌లో రిలీజ్ అయింది. 

"అడ‌వి అన్నాక.. సింహం, పులి, చిరుత అన్నీ వేట‌కు వెళ‌తాయి..
జింక త‌ప్పించుకోవాలని చూస్తుంది..
ఆలోపు సూర్యాస్త‌మ‌యం అయితే..
సూర్యోద‌యాన్ని చూడ‌బోయేది ఎవ‌రో
ప్ర‌కృతి నిర్ణ‌యిస్తుంది
కానీ ఈ అడ‌విలో, వెలుగు ఎక్క‌డ ఎప్పుడు అని నిర్ణ‌యించేది ప్ర‌కృతి కాదు.. నేను"

ఈ సినిమా ట్రైలర్‌లో తన న‌ట‌న‌ విశ్వ రూపాన్ని మరోసారి చూపించారు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan). ఓ వైపు రాజ‌కీయాలు.. మ‌రోవైపు సినిమాల‌తో క‌మ‌ల్ హాస‌న్ ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. లోకేష్ కనగరాజ్ 'విక్ర‌మ్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్ వర్క్‌కు ఫిలోమిన్ రాజ్ సారధ్యం వహిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ చాలా వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్న 'విక్ర‌మ్' చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!