అమ్మ‌కు ప్రేమ‌తో - ఇట్లు విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)

Updated on May 11, 2022 10:58 PM IST
విజ‌య్ దేవ‌రకొండ(Vijay Deverakonda) బ‌ర్త్‌డే క‌శ్మీర్‌లో చేసుకున్నారు. త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన అమ్మ కోసం విజ‌య్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.
విజ‌య్ దేవ‌రకొండ(Vijay Deverakonda) బ‌ర్త్‌డే క‌శ్మీర్‌లో చేసుకున్నారు. త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన అమ్మ కోసం విజ‌య్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.

విజ‌య్ దేవ‌రకొండ(Vijay Deverakonda) బ‌ర్త్‌డే క‌శ్మీర్‌లో చేసుకున్నారు. త‌న‌కు జ‌న్మ‌నిచ్చిన అమ్మ కోసం విజ‌య్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్‌తో అత‌ని మ‌న‌సు ఏంటో తెలిసింద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. 

బ్ర‌తకాలంటే  పోరాడాల్సిందేనంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Deverakonda) లైగ‌ర్ టీజ‌ర్ కోట్ చేసింది. ప్ర‌స్తుతం లైగ‌ర్ సినిమా షూటింగ్ క‌శ్మీర్‌లో జ‌రుగుతుంది. మే 9 విజయ్ దేవ‌ర‌కొండ బ‌ర్త్‌డే. దీంతో క‌శ్మీర్ షూటింగ్ లొకేష‌న్‌లోనే విజ‌య్ పుట్టిన‌రోజు వేడుక‌లు చేసుకున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండకు త‌న అమ్మ ప్రేమ‌ను గుర్తు చేసుకుంటూ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. త‌న త‌ల్లి మాధ‌వి కోసం ఇలా పోస్ట్ పెట్టారు..


 

 
 
మా అమ్మ నాకు 15 ఏళ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుటి నుంచి పుట్టిన రోజు చేసుకోవ‌డం మానేశారు. నా పై చూపే ప్రేమే.. మా అమ్మ‌పై ఇంకా కేరింగ్ పెంచుతుంది. 8 ఏళ్ల క్రితం వ‌ర‌కు నా గురించి ఎవ‌రికీ తెలీయ‌దు. నా వెనుక ఉండి న‌న్ను ఎప్పుడూ ప్రోత్స‌హించేది మా అమ్మే. ప్ర‌స్తుతం నన్ను చాలా మంది అభిమానిస్తున్నారు. స‌పోర్ట్ చేస్తున్నారు. నా కోసం ఫైట్ చేస్తున్నారు. హ‌ద్దులు లేని ప్రేమ‌ను పంచుతున్నారు. మా అమ్మ ఇచ్చిన జ‌న్మ వ‌ల్లే ఇదంతా జ‌రిగింది. అమ్మ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను.
అమ్మ‌కు ప్రేమ‌తో విజ‌య్
 

విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Deverakonda) వాళ్ల అమ్మ‌కు ప్రేమ‌తో పెట్టిన ట్వీట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. త‌న కుటుంబం అంటే త‌న‌కు ఎంత ఇష్ట‌మోన‌ని అంటున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా స్ట్రాంగ్ ఫీలీంగ్స్ ఉన్నాయ‌ని.. బాధ్య‌త‌గా ఉంటాడ‌ని ఫ్యాన్స్  కామెంట్స్ పెడుతున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!