Vijay Devarakonda: క‌శ్మీర్‌లో సామ్‌ను ఫ‌స్ట్ టైం చూసి విజ‌య్ దేవ‌ర‌కొండ (VD 11) ఫ్లాట్

Updated on May 15, 2022 02:30 PM IST
క‌శ్మీర్‌లో సామ్‌ను ఫ‌స్ట్ టైం చూసి విజ‌య్ దేవ‌ర‌కొండ (VD 11) ఫ్లాట్
క‌శ్మీర్‌లో సామ్‌ను ఫ‌స్ట్ టైం చూసి విజ‌య్ దేవ‌ర‌కొండ (VD 11) ఫ్లాట్

Vijay Devarakonda: టాప్ స్టార్లు విజ‌య దేవ‌రకొండ‌, స‌మంతల కొత్త‌ సినిమా (VD 11) ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కానుంది. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ VD 11 ఫ‌స్ట్ లుక్‌ను భారీగా ప్లాన్ చేశార‌ట‌. విజ‌య్ తొలి సారి సామ్‌(samantha)ను చూసే సీన్ సెన్సేష‌న్ అయ్యేలా రిలీజ్ చేయ‌నున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌ద‌కొండో సినిమా VD 11 ఫ‌స్ట్ లుక్  (VD11 first look) ఏప్రిల్ 16 న విడుద‌ల కానుంది. పూరితో పాన్ ఇండియా సినిమా లైగర్ మూవీ చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం ఫుల్ బిజీ అయ్యారు. స‌మంత‌తో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా చేస్తున్నారు. 

ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ VD 11 ఫ‌స్ట్ లుక్‌ను భారీగా ప్లాన్ చేశార‌ట‌

ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ VD 11 ప్రాజెక్టుల‌ను చాలెంజ్‌గా తీసుకున్నట్లు క‌నిపిస్తుంది. స‌మంత‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల ఫ‌స్ట్ మీట్ హై ఓల్టేజ్‌తో ఉండే సీన్ ప్లాన్ చేశారు. మే 16 ఉదయం 9:30 గంటలకు VD 11 విడుద‌లంటూ మైత్రీ మూవీస్ ట్వీట్ చేసింది. స‌మంత‌, విజ‌య్‌దేవ‌ర‌కొండ రీ ట్వీట్ చేశారు. విజ‌య్, స‌మంత‌ల మ‌ధ్య మ‌హాన‌టి మూవీలో సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇక కొత్త ప్రాజెక్టు వీరికి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ ఓ మూవీ చేయాల్సి ఉంది. సుకుమార్ పుష్ప‌2తో బిజీగా ఉన్నారు. ఏడాది వ‌ర‌కు సుకుమార్‌, విజ‌య్ సినిమా సెట్స్ ఎక్క‌న‌ట్టే. ఇక లైగ‌ర్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ శివ నిర్మాణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 

పూరి జగన్నాథ్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న లైగర్ (Liger) సినిమా ఆగష్టు 25న విడుదల కానుంది. బాక్స‌ర్‌గా లైగ‌ర్ సినిమాలో విజ‌య్ క‌నిపిస్తాడు. పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో లైగ‌ర్ విడుద‌ల అవుతుంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే విజ‌య్‌కు జోడిగా లైగ‌ర్‌లో న‌టిస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!