విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)పై ఫైర్‌‌ అయిన యాంకర్.. ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

Updated on May 02, 2022 07:06 PM IST
అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో  విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)
అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)

తను నటించిన సినిమా ప్రమోషన్స్‌ కోసం నడిరోడ్డుపై ప్రాంక్ వీడియో తీసి విమర్శలు ఎదుర్కొంటున్న విశ్వక్‌సేన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం ఉదయం ఒక ప్రముఖ చానల్‌లో జరిగిన డిబేట్‌లో వివాదం జరిగింది. ఆ వివాదంలో హీరో విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)పై ఆ చానల్‌ యాంకర్‌‌ ఫైర్ అయ్యింది.

గెట్‌ అవుట్‌ ఆఫ్‌ మై స్టూడియో అని విశ్వక్‌సేన్‌ పై అరిచింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. స్టూడియోకు పిలిచి విశ్వక్‌ను అవమానించడం ఏమిటని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఒక హీరోపై అలా అరవడం ఏమిటని పలువురు మండిపడుతున్నారు. కొందరైతే నువ్వు స్టూడియోలో వర్క్ చేస్తావ్‌ అంతే.. కంపెనీ నీది కాదు అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా, విశ్వక్‌ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ప్రమోషన్స్‌ను స్పీడప్‌ చేసింది చిత్ర యూనిట్.ఇందులో భాగంగా ఒక యువకుడితో కలిసి విశ్వక్‌సేన్‌ రోడ్డుపై ప్రాంక్ వీడియో చేశాడు. అది కాస్తా రచ్చ రచ్చ అయ్యింది. రోడ్డుపై ప్రాంక్‌ వీడియో చేయడంపై పలువురు విశ్వక్‌పై మండిపడుతున్నారు. కొందరైతే.. ప్రమోషన్స్‌ కోసం ఇంతకు దిగజారుతారా అని విమర్శలు కూడా చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు విశ్వక్‌కు మరో తలనొప్పి వచ్చి పడింది.

తన ప్రాంక్ వీడియో కోసం ఓ యువకుడ్ని తీసుకొచ్చాడు విశ్వక్‌. కొత్త సినిమా రిలీజ్‌ అయ్యే సమయంలో ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్ద రివ్యూలు చేసే యువకుడితో ఈ ప్రాంక్ వీడియో చేశాడు. ‘విశ్వక్‌సేన్‌ తన కారులో ఫిలింనగర్‌‌ రోడ్డులో వెళుతుంటాడు, సరిగ్గా అదే సమయంలో ఆ యువకుడు రోడ్డుపై కారుకు అడ్డంగా పడుకుని హల్‌చల్‌ చేశాడు. విశ్వక్‌సేన్ కారులోంచి దిగి అసలేం జరిగిందని యువకుడిని అడుగుతాడు. అప్పుడు ఆ యువకుడు అల్లం అర్జున్‌ కుమార్ (అశోక వనంలో అర్జున కల్యాణం సినిమాలో హీరో విశ్వక్‌సేన్‌ పేరు)కు33 సంవత్సరాలు వచ్చినా పెళ్లి కాలేదు సార్‌‌. అది నేను తట్టుకోలేకపోతున్నాను. పెట్రోల్‌ పోసుకుని సూసైడ్‌ చేసుకుంటానంటూ హడావుడి చేశాడు. ఇదంతా నిజంగానే జరుగుతోందా అన్నట్టు విశ్వక్‌ కూడా బిహేవ్ చేశాడు. 

దీంతో కాసేపు నడిరోడ్డుపై  వీరిద్దరి హంగామా నడిచింది. ట్రాఫిక్ ఆగిపోవడంతో అక్కడి జనాలు కూడా ఇబ్బంది పడ్డారు. ఈ వీడియోని సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ప్రమోట్ చేయగా ఇది చూసిన వాళ్లంతా సినిమా ప్రమోషన్స్‌ కోసం మరీ ఇంతగా దిగజారాలా? ప్రమోషన్స్ పేరుతో పబ్లిక్‌ ప్లేస్‌లో ప్రాంక్‌ వీడియోలు చేస్తూ  ఈ న్యూసెన్స్‌ ఏంటి అని విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఒక న్యూస్ చానల్‌లో జరిగిన కార్యక్రమంలో యాంకర్‌‌కు విశ్వక్‌సేన్‌కు మధ్య వివాదం జరిగింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!