Top 10 Stars in TV : ఈ హీరోయిన్స్ డిసైడ్ చేస్తే అట్లుంటది మరి!
వెండితెరను షేక్ చేసిన హీరోయిన్స్.. ఇప్పుడు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. ప్రత్యేక షోల్లో మెరుస్తున్నారు. షో జడ్జీలుగా తమ హవా కొనసాగిస్తున్నారు. కామెడీ, డాన్స్, సాంగ్స్ ... ఎలాంటి ప్రోగ్రామైనా తగ్గేదేలే అంటూ తీర్పులిస్తున్నారు. బుల్లితెర షో న్యాయనిర్ణేతలుగా పాపులర్ అయిన కథానాయికల విశేషాలు మీకోసం.
1. రోజా సెల్వమణి (Roja Selvamani)
రోజా సెల్వమణి ఒకప్పటి అగ్ర కథానాయకురాలు. అగ్ర హీరోలతో నటించారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన తర్వాత.. రోజా జబర్దస్త్ షో న్యాయ నిర్ణేతగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ షో తర్వాత రోజా మరింత పాపులర్ అయ్యారు. ప్రేక్షకుల నుంచి మంచి పేరును సంపాదించుకున్నారు. షో చేస్తూనే సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు రోజా. పదేళ్లు దాదాపు 450 ఎపిసోడ్‌లకు పైగా, జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరించారు. మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా క్విట్ అయ్యారు.
2. ప్రియమణి (Priyamani)
పెళ్ళైనకొత్తలో. సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రియమణి. పరుత్తివీరన్‌లోని నటనకు జాతీయ ఉత్తమ నటిగా 2006లో అవార్డు అందుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో నటించారు. తెలుగులో ‘ఢీ 10’ డాన్స్ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. తన ఆట, పాటలతో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు.
3. పూర్ణ (Poorna)
పూర్ణ క్లాసికల్ డాన్సర్. ఓ డాన్స్ షోలో డాన్సర్‌గా ఎంటరైన పూర్ణ.. సినిమా అవకాశాలు రావడంతో హీరోయిన్ అయ్యారు. రాజు గారి గది సినిమాలో దయ్యం పాత్ర పూర్ణకు మంచి పేరు తెచ్చింది. ప్రస్తుతం డాన్స్ షో ఢీలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.‘ఢీ’ భామ పూర్ణకి మంచి ఫాలోయింగే ఉంది.
4.ఇంద్రజ (Indraja)
కర్ణాటక సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు ఇంద్రజ. ఈమె కూచిపూడి డాన్సర్. యమలీల సినిమాతో తెలుగు స్టార్ కథానాయికగా మారారు. పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఇంద్రజ... తర్వాత బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్‌కి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
4.శ్రీదేవి విజయ్ కుమార్ (Sri Devi Vijaya Kumar)
తమిళ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల చిన్న కూతురు శ్రీదేవి. ఈమె తమిళ సినీ పరిశ్రమలో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు సంపాదించారు. ఈశ్వర్, నిన్నే ఇష్టపడ్డాను లాంటి తెలుగు సినిమాల్లో ఈమె చేసిన రోల్స్ తనకు మంచిపేరు తెచ్చాయి. అలాగే కామెడీ స్టార్స్ అనే టీవీ ప్రోగ్రామ్‌కు జడ్జిగా వ్యవహరించారు. షో ఎంట్రీలో శ్రీదేవి తన డాన్స్‌లతో ప్రేక్షకుల కూడా మెప్పు పొందారు.
5. అర్చన (Archana)
వేద అనే పేరుతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక అర్చన. ఈమె ఓ క్లాసికల్ డాన్సర్. తెలుగు, తమిళ, మళయాల సినిమాల్లో నటించారు. నేను, కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా సినిమాలో చేసిన పాత్ర కూడా మంచి గుర్తింపు తెచ్చింది.ఛాలెంజ్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
6. మోనాల్ గజ్జర్ (Monal Gajjar)
మిస్ గుజరాతీ టైటిల్ విజేత మోనాల్ గజ్జర్. అల్లరి నరేష్‌తో కలిసి ఈమె సుడిగాడు సినిమాలో నటించింది. తెలుగు, హిందీ, గుజరాతీ భాషల్లో పలు సినిమాలు చేసింది. మోనాల్‌కు సినిమాల ద్వారా అంత గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ అయిన వెంటనే, డ్యాన్స్ ప్లస్ షోకి న్యాయనిర్ణేతగా అవకాశం వచ్చింది.