టాలీవుడ్‌లో మరో విషాదం.. అలనాటి హాస్య నటుడు 'కడలి జయసారథి' (Kadali Jayasaradhi) కన్నుమూత !

Updated on Aug 01, 2022 07:08 PM IST
దాదాపు 372 సినిమాల్లో న‌టించి టాలీవుడ్ (Tollywood) ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు జయసారథి (Jaya Sarathi).
దాదాపు 372 సినిమాల్లో న‌టించి టాలీవుడ్ (Tollywood) ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు జయసారథి (Jaya Sarathi).

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు (Kadali Jayasarathi) కడలి జయ సారథి (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రస్థానంలో జయసారథి అంత్యక్రియలు జరిగాయి. 

దాదాపు 372 సినిమాల్లో న‌టించి టాలీవుడ్ (Tollywood) ఇండ‌స్ట్రీలో త‌నకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు జయసారథి. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే సారథి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని అందిస్తున్నారు

జ‌య‌సార‌థి (Jayasaradhi) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌లోని భీమ‌వ‌రంలో 1942 జూన్ 26న జ‌న్మించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘వెలుగు నీడ‌లు’ చిత్రంతో ఈయ‌న, సినీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘మ‌న ఊరి రామాయ‌ణం’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘డ్రైవ‌ర్ రాముడు’, ‘భ‌క్త క‌న్న‌ప్ప’ వంటి సినిమాల‌తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయ‌న చివ‌ర‌గా సుమన్‌, రంభ హీరో హీరోయిన్లుగా న‌టించిన ‘హ‌లో అల్లుడు’ సినిమాలో డాక్ట‌ర్ పాత్ర‌లో న‌టించారు.

జ‌య‌సార‌థి.. తెలుగు చిత్రపరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాద్‌ కు తరలించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) వ్యవస్థాపక సభ్యుడిగానూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. అలాగే నాటకరంగానికి కూడా సేవచేశారు. ఋష్యేంద్రమణి, స్థానం నరసింహారావు, రేలంగి వెంకట్రామయ్య, బి.పద్మనాభం వంటి గొప్ప నటులతో కలిసి నాటకాలలో నటించారు.

అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah), రేలంగి, రాజబాబు, పద్మనాభం, అంజి వంటి హాస్య నటులతో పాటు, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సారథి. 'భలే రంగడు', 'అగ్గి వీరుడు', 'మంచి మనసులు', 'భక్త కన్నప్ప', 'ఎదురీత', 'అమర దీపం', 'ఆలుమగలు', 'జగన్మోహిని', 'మనవూరి పాండవులు', 'డ్రైవర్ రాముడు' వంటి హిట్ సినిమాల్లో ఆయన నటించారు. 90వ దశకంలో  నటనకి స్వస్తి పలికి కృష్ణంరాజుతో కలిసి 'ఇంటింటి రామాయణం', 'జమిందారి గారి అమ్మాయి' వంటి సినిమాలకు సాంకేతిక సహకారం అందించారు. రెబల్ స్టార్ కృష్ణంరాజుతో (Rebel Star Krishnam Raju) సారథికి ప్రత్యేక అనుబంధం ఉంది.

Read More: రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేయనున్న జగపతి బాబు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన జగ్గూ భాయ్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!