OTT Releases: ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో విడుదల అయ్యే చిత్రాలివే

Updated on May 11, 2022 11:24 PM IST
OTT Movies
OTT Movies

సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వరుస హిట్లతో పండగ చేసుకుంటోంది. పుష్ప, అఖండ, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు బాక్సాఫీసును షేక్ చేశాయి. కరోనా కాలంలో పెద్ద సినిమాలు థియేటర్లను దాటి ఓటీటీని నమ్ముకోవడంతో.. ఆ మాధ్యమానికి కూడా ఒక మార్కెట్ అనేది ఏర్పడింది. నారప్ప, దృశ్యం లాంటి సినిమాలు ఓటీటీ ద్వారానే ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. 

ప్రస్తుతం థియేటర్ల పరిస్థితి బాగున్నా కాకుండా.. ఓటీటీ మార్కెట్ కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీ ద్వారా కూడా తమ లక్ పరీక్షించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీతో పాటు, థియేటర్లలో  విడుదల అయ్యే సినిమాల గురించి మనమూ తెలుసుకుందాం

జెర్సీ (Jersey)
షాహిద్‌ కపూర్‌, మృణాల్‌ ఠాకూర్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం జెర్సీ. టాలీవుడ్‌లో నాని కథానాయకుడిగా వచ్చిన జెర్సీ సినిమాకి ఇది రీమేక్‌. తెలుగులో ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించిన గౌతమ్‌ తిన్ననూరి హిందీ రీమేక్‌కు కూడా డైరెక్షన్ వహించాడు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ నెల 22న థియేటర్లలో విడుదలవుతోంది.

1996 ధర్మపురి (1996 Dharmapuri)
కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ సమర్పణలో గగన్‌ విహారి, అపర్ణ నటించిన చిత్రం 1996 ధర్మపురి. విశ్వజగత్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు . ఏప్రిల్ 22 తేదిన ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. 

గని (Gani)
మెగా వారసుడు వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని. ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత ఆదరణను పొందలేదు. ఏప్రిల్ 22 తేదిన ఆహా ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది.

ఇతర చిత్రాలు
అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఓ మై డాగ్‌ అనే చిత్రం ఏప్రిల్‌ 21 తేదిన విడుదల అవుతుండగా, గిల్టీ మైండ్స్‌ అనే చిత్రం ఏప్రిల్‌ 22 తేదిన రిలీజ్ కానుంది.

అలాగే జీ5 ఓటీటీలో అనంతం అనే చిత్రం ఏప్రిల్ 22 తేదిన విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా కుథిరైవాల్, ద మార్క్‌డ్‌ హార్ట్‌ చిత్రాలు ఏప్రిల్‌ 20 తేదిన విడుదల అవుతుండగా, ఏప్రిల్ 21 తేదిన హి ఈజ్‌ ఎక్స్‌పెక్టింగ్‌ (వెబ్‌సిరీస్‌) విడుదల అవుతోంది.

అలాగే ఏప్రిల్ 22 తేదిన సోని లివ్‌లో అంత్యాక్షరి అనే సినిమా విడుదల అవుతుండగా.. లండన్ ఫైల్స్ అనే చిత్రం ఏప్రిల్ 21 న వూట్ ఓటీటీలో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!