Colours Swathi: వెండితెరపైకి 'కలర్స్' స్వాతి రీఎంట్రీ.. 'మంత్‌ ఆఫ్‌ మధు' (Month Of Madhu) ఫస్ట్ లుక్ రిలీజ్!

Updated on Jul 10, 2022 08:29 PM IST
కలర్స్ స్వాతి, 'మంత్ ఆఫ్ మధు' పోస్టర్ (Colours Swathi, Month Of Madhu Poster)
కలర్స్ స్వాతి, 'మంత్ ఆఫ్ మధు' పోస్టర్ (Colours Swathi, Month Of Madhu Poster)

Colours Swathi: టాలీవుడ్ లో చాలాకాలం తర్వాత హీరోయిన్ కలర్స్ స్వాతి మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోతోంది. యంగ్ హీరో నవీన్‌చంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మంత్‌ ఆఫ్‌ మధు' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.  శ్రీకాంత్‌ నాగోతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'భానుమతి అండ్ రామకృష్ణ' సినిమాని నిర్మించిన క్రిషివ్ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ మేకర్స్ పతాకంపై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు. 

బుల్లితెరపై 'కలర్స్' ప్రోగ్రామ్‌తో పాపులర్‌ అయి.. అదే తన ట్యాగ్‌గా మార్చుకున్న ఈ భామ .. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెంకటేశ్ (Venkatesh), త్రిష (Trisha) జంటగా నటించిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమాతో ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక, హీరోయిన్ గా మారిన ఈ ముద్దుగుమ్మ... ‘అష్టా చెమ్మా’ (Ashta Chamma Movie) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ తదితర సినిమాలతో వరుస విజయాలు అందుకుంది. తెలుగుతో పాటు, తమిళంలోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి, స్టార్‌డమ్ దక్కించుకుంది.  అలాగే, మలయాళంలో ‘మోసాయిలే’, ‘కుదిర మీనుగళ్’, ‘నార్త్ 24 కాతమ్’, ‘త్రిషూర్ పూరమ్’, ‘ఆమెన్’ లాంటి హిట్ మూవీస్ చేసింది.

కెరీర్ పీక్స్‌లో వున్న టైమ్‌లోనే పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలైపోయింది. మళ్లీ ఈ మధ్యనే ముఖానికి రంగేసుకోవాలని ఆశ పుట్టిందట కలర్స్ స్వాతికి (Colours Swathi). ఆ మధ్య మళ్ళీ కార్తికేయ సీక్వెల్ సినిమాతో మళ్ళీ స్వాతి ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అవన్నీ కేవలం గాసిప్స్ మాత్రమే. ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాతో కలర్స్ స్వాతి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇదో డిఫరెంట్ పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది.

Read More: Rashmika Mandanna: ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన 'పుష్ప'(Pushpa) బ్యూటీ రష్మిక మందన్నా.. ఫొటోలు వైరల్! 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!