Venkatesh-Anudeep KV: F3 తర్వాత 'జాతి రత్నాలు' దర్శకుడితో వెంకటేష్ సినిమా.. పొట్ట‌ చెక్క‌ల‌య్యే కామెడీ ఖాయం!

Updated on Jun 29, 2022 05:02 PM IST
విక్టరీ వెంకటేష్, అనుదీప్ (Anudeep KV, Venkatesh)
విక్టరీ వెంకటేష్, అనుదీప్ (Anudeep KV, Venkatesh)

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ఓ వైపు 'దృశ్యం' లాంటి విభిన్నమైన చిత్రాలు చేస్తూనే.. ఎఫ్3 లాంటి వినోదాత్మక చిత్రాలతో అలరిస్తున్నారు. గతేడాది 'నారప్ప' 'దృశ్యం 2' వంటి సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసిన వెంకీ.. ఇటీవల 'ఎఫ్ 3' చిత్రంతో థియేట్రికల్ సక్సెస్ అందుకున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఎఫ్ 3లో పొట్ట‌చెక్క‌ల‌య్యే కామెడీతో వినోదాన్ని అందించాడు వెంకీ.

యాక్ష‌న్‌, కామెడీ, సీరియ‌స్, సస్పెన్స్..ఇలా ప్ర‌తీ జోన‌ర్స్ లో సినిమాలు చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటాడు వెంకీ. ప్ర‌త్యేకించి వెంకీ స్టైల్ ఆఫ్ కామెడీని సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూసి క‌డుపుబ్బా నవ్వుకోవ‌డం మాత్రం ప‌క్కా అని చెప్పొచ్చు. అయితే ఈ దగ్గుబాటి హీరో సోలోగా తదుపరి సినిమా ఎంటనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెంకీ-అనుదీప్ (Anudeep KV) సినిమా అప్‌డేట్ ఒక‌టి ఫిలింగ‌నగ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.  

ఇప్పటివరకు వెంకటేష్ తదుపరి చిత్రాల లిస్టులో ఎంతో మంది దర్శకుల పేర్లు వినిపించాయి కానీ.. అధికారికంగా ఏదీ ప్రకటించబడలేదు. ఇప్పుడు లేటెస్టుగా యువ దర్శకుడు అనుదీప్ కేవీ పేరు తెర పైకి వచ్చింది. 'పిట్టగోడ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్.. 'జాతిరత్నాలు' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ప్రస్తుతం అనుదీప్ తమిళ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా 'ప్రిన్స్' అనే ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే దర్శకుడు ఈ ప్రాజెక్ట్ తర్వాత స్టార్ హీరో వెంకటేష్ తో జతకట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

'ప్రిన్స్' సినిమా ప‌నులు పూర్త‌యిన వెంట‌నే వెంకీ.. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అంతేకాదు ఇందులో వెంకీ కామెడీ యాంగిల్‌ను ఫుల్‌గా వాడుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. సినిమా లైన్‌ను వెంకటేశ్‌కు వినిపించిన వెంట‌నే కేవ‌లం 10 నిమిషాల్లోనే బాగా న‌చ్చేసింద‌ని అనుదీప్‌కు చెప్పిన‌ట్టు ఇన్ సైడ్ టాక్‌. ఆ లైన్ ఆధారంగా స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేయ‌నున్నాడ‌ట అనుదీప్. జాతిరత్నాలు (Jathiratnalu) చిత్రాన్ని అనుదీప్ కామెడీతోనే బ్లాక్ బస్టర్ గా మలిచారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పేదేముంది. వీరిద్దరూ చేతులు కలిపితే ఆడియన్స్ పొట్ట చెక్కలు కావడం ఖాయం. 

ఇదిలా ఉంటే.. వెంకటేష్ ప్రస్తుతం 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇందులో రానా దగ్గుబాటితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇది వీరిద్దరికీ డిజిటల్ డెబ్యూ కావడం విశేషం. ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న 'కభీ ఈద్ కభీ దివాలీ' అనే సినిమాలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చాలా గ్యాప్ తర్వాత వెంకీ ఈ సినిమాతో హిందీ స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. 

Read More: Salman Khan: ఒకే ఫ్రేములో చిరంజీవి, వెంకటేష్, సల్మాన్ ఖాన్.. ఫోటో చూసేందుకు రెండు కళ్లు చాలలేదుగా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!