ధ‌నుష్ (Dhanush)‘కెప్టెన్ మిల్లర్‌’ సినిమాలోని కీలకపాత్రలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్?

Updated on Sep 17, 2022 10:49 PM IST
తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా సర్. ఈ సినిమా తర్వాత కెప్టెన్ మిల్లర్ సినిమాను పట్టాలెక్కించనున్నారు
తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా సర్. ఈ సినిమా తర్వాత కెప్టెన్ మిల్లర్ సినిమాను పట్టాలెక్కించనున్నారు

తమిళ హీరో ధనుష్ (Dhanush)కు తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. 3, రఘవరన్‌ బీటెక్, వీఐపీ2, మారి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు. చాలాకాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడిన ధనుష్‌కు ‘తిరు’ సినిమా మంచి కమ్‌బ్యాక్ లభించింది. ఆ సినిమా ఇచ్చిన జోష్‌తో ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు ధనుష్.

ధనుష్‌ హీరోగా తెరకెక్కిన ‘నానే వరువెన్’ విడుదలకు సిద్దంగా ఉంది. సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ‘నేనే వస్తున్నా’ అనే టైటిల్‌తో విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్‌‌కు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ధనుష్‌ నటిస్తున్న మరో సినిమా ‘సర్’. తెలుగుతోపాటు తమిళంలో సర్ సినిమా తెరకెక్కుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతూ చివరి దశకు చేరుకుంది.

తమిళ స్టార్ హీరో ధనుష్‌ (Dhanush) తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా సర్. ఈ సినిమా తర్వాత కెప్టెన్ మిల్లర్ సినిమాను పట్టాలెక్కించనున్నారు

హీరో క్యారెక్టర్‌‌కు సమానంగా..

ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండ‌గానే ‘కెప్టెన్ మిల్లర్’ అనే పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమాను అనౌన్స్ చేశారు ధనుష్. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. కెప్టెన్ మిల్లర్ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైర‌ల్‌ అవుతోంది.

కెప్టెన్ మిల్లర్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిష‌న్ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారని స‌మాచారం. హీరో క్యారెక్టర్‌‌కు స‌మానంగా సందీప్ కిష‌న్ పాత్ర ఉండ‌నుందని ఇండస్ట్రీ టాక్. త్వర‌లోనే దీనిపై అధికారికంగా ప్రక‌ట‌న రానుందరి తెలుస్తోంది.ధ‌నుష్ కెరీర్‌లోనే అత్యంత భారీగా బడ్జెట్‌ అంటే దాదాపు రూ.100 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని టాక్. 1930 – -40లలోని టైం పీరియ‌డ్‌లో జరిగిన కథతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. త‌మిళంతోపాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో ధనుష్‌ (Dhanush) కెప్టెన్‌ మిల్లర్ సినిమా రూపొంద‌నుంది.

Read More : Thiruchitrambalam: ధ‌నుష్ (Dhanush) సినిమా 'తిరు' ట్రైలర్ రిలీజ్.. ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా కామెడీ పంచ‌నున్న‌ హీరో

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!