రామ్ (RamCharan)ను మిగ‌తా హీరోలు రోల్ మోడ‌ల్‌గా తీసుకోవాల‌న్న‌ హ‌ర్యానా ఎమ్మెల్యే

Updated on May 14, 2022 06:01 PM IST
రామ్ చ‌ర‌ణ్ (RamCharan)  శివుడికి చేస్తున్నసేవ‌లను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన హ‌ర్యానా ఎమ్మేల్యే వాల్మీకి
రామ్ చ‌ర‌ణ్ (RamCharan) శివుడికి చేస్తున్నసేవ‌లను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన హ‌ర్యానా ఎమ్మేల్యే వాల్మీకి

రామ్ చ‌ర‌ణ్ (RamCharan) ఎంత బిజీగా ఉన్నా దైవ ద‌ర్శ‌నాలు కూడా చేస్తుంటారు. ఆర్.ఆర్.ఆర్. సినిమా రిలీజ్ త‌ర్వాత అయ్య‌ప్ప మాల వేసుకున్నారు. శివ పూజ‌లో ఉన్న రామ్ చ‌ర‌ణ్ వీడియోను హ‌ర్యానా ఎంపీ ట్వీట్  చేశారు.  

రామ్ చ‌ర‌ణ్(RamCharan) టాలీవుడ్‌లో పెద్ద స్టార్‌డ‌మ్ ఉన్న హీరో. డిఫెరెంట్ స్టోరీల‌తో మాస్, క్లాస్ క్యారెక్ట‌ర‌ల‌తో మెప్పిస్తాడు. రామ్ చ‌ర‌ణ్‌కు సినిమాల‌పైన ఎంతో ఇష్టం ఉందో.. దేవుడిపైన కూడా అంత శ్ర‌ద్ధ ఉంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం రామ్ చ‌ర‌ణ్ అయ్య‌ప్ప స్వామి మాల వేసుకుంటారు. శ‌బ‌రిమ‌లై వెళ్లి అయ్య‌ప్ప ద‌ర్శ‌నం చేసుకుంటారు. 

రామ్ చ‌ర‌ణ్ శివాలయంలో శివ‌లింగాన్ని క‌డిగే వీడియో హ‌ర్యానాకు చెందిన ఎమ్మేల్యే వాల్మీకి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ స్టార్ హీరో అయినా కూడా దేవుడికి సేవ చేయ‌డంలో శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ఎంతో భ‌క్తి భావంతో శివ లింగాన్ని నీళ్ల‌తో శుభ్రం చేస్తున్నారంటూ వాల్మీకీ ట్వీట్ చేశారు. మిగ‌తా సినీ సెల‌బ్రేటీలు కూడా రామ్ చ‌ర‌ణ్‌ను రోల్ మోడ‌ల్‌గా తీసుకోవాంటూ వాల్మీకీ పోస్ట్ పెట్టారు 
 
ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ శివుడికి చేస్తున్నసేవ‌లు సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిగా మారింది. రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లారు.. హ‌ర్యానా రాష్ట్ర ఎమ్మెల్యే రామ్  వీడియో ఎందుకు పోస్ట్ చేశారు అంటూ ఫ్యాన్స్ మెసెజ్‌లు పెడుతున్నారు. 

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!