"మా" భవనానికి లైన్ క్లియర్.. భూమిపూజకు సర్వం సిద్ధం : మంచు విష్ణు (Manchu Vishnu)

Updated on May 16, 2022 12:45 PM IST
సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై రియాక్ట్ అయిన మంచు విష్ణు (Manchu Vishnu)
సినిమా టికెట్ల వ్య‌వ‌హారంపై రియాక్ట్ అయిన మంచు విష్ణు (Manchu Vishnu)

'మా' అధ్య‌క్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) ప‌లు అంశాల‌పై స్పందించారు. మా సంస్థ‌కు శాశ్వ‌త భ‌వ‌నం, సినిమా టికెట్ ధరల పెంపు మొదలైన విషయాలపై ఆయన  మాట్లాడారు.  మా ఎన్నిక‌ల స‌మ‌యంలో మంచు విష్ణు, ఆర్టిస్టుల కోసం శాశ్వ‌త భ‌వ‌నాన్ని క‌ట్టిస్తాన‌ని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే  ఏఐజీ హాస్పిటల్‌లో మంచు విష్ణు, ఆర్టిస్టుల కోసం ఓ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్క‌డ ప‌లు అంశాల‌పై  మాట్లాడారు.  ఆరు నెలల్లోనే "మా"శాశ్వత భవనానికి భూమి పూజ చేస్తానన్నారు. భ‌వ‌నాన్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా క‌ట్టిస్తాన‌ని కూడా ఆయన హామి ఇచ్చారు.

ఇదే క్రమంలో సినిమా టికెట్ రేట్ల పెంపు గురించి కూడా మంచు విష్ణు త‌న అభిప్రాయాన్ని తెలిపారు. మూవీ టికెట్ రేట్లు పెంచితే.. కొందరికి లాభమని, ఇంకొందరికి నష్టమని అన్నారు. అందుకే తాను టికెట్ల రేట్ల విష‌యంలో మౌనంగా ఉన్నాన‌ని చెప్పారు.  "టికెట్ ధరల పెంపు - నియంత్రణ" అనేది చాలా పెద్ద అంశమని.. ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ కలిసి ఈ విషయానికి సంబంధించి ఓ నిర్ణ‌యం తీసుకుంటే బాగుంటుంద‌ని మంచు విష్ణు కోరారు.

మంచు విష్ణు ప్ర‌స్తుతం తన కొత్త సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్‌లతో మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్నారు. ఓ వైవిధ్యమైన క‌థ‌తో త్వ‌ర‌లో, ఆయన ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!