NBK 107: స్పెషల్​ సాంగ్​తో ర‌చ్చ చేయ‌నున్న బాల‌కృష్ణ‌

Updated on May 19, 2022 10:36 AM IST
 NBK 107 : ఓ స్పెష‌ల్ సాంగ్ షూటింగ్‌లో బాల‌కృష్ణ బిజీగా ఉన్నారు
NBK 107 : ఓ స్పెష‌ల్ సాంగ్ షూటింగ్‌లో బాల‌కృష్ణ బిజీగా ఉన్నారు

బాల‌కృష్ణ అఖండ త‌ర్వాత NBK 107 అనే టైటిల్ సినిమాలో న‌టిస్తున్నారు. గోపిచంద్ మ‌లినేని ఎన్‌బీకే 107 సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాల‌కృష్ణ ఎన్‌బీకే 107 స్పెష‌ల్ సాంగ్ షూటింగ్ జ‌రుగుతుంది. మాస్ డాన్సుల‌తో బాల‌కృష్ణ ర‌చ్చ చేయ‌నున్నాను. ఏ హీరోయిన్‌తో బాల‌య్య స్టెప్పులుంటాయో మాత్రం ఇంకా రివీల్ కాలేదు. 

బాల‌కృష్ణ (Balakrishna)  డ‌బుల్ రోల్‌లో న‌టించిన సినిమా అఖండ‌. అఖండ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాల‌కృష్ణ‌కు భారీ హిట్ ఇచ్చింది. అఖండ త‌ర్వాత బాల‌కృష్ణ గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌బీకే 107లో న‌టిస్తున్నారు. ఎన్‌బీకే 107 సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఓ స్పెష‌ల్ సాంగ్ షూటింగ్‌లో బాల‌కృష్ణ బిజీగా ఉన్నారు. ఆ పాట‌కు సంబంధించిన బాల‌కృష్ణ న్యూ లుక్ సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. 

బాల‌య్య లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు ఖుషీ అవుతున్నారు. జై బాల‌య్య సాంగ్‌కు బాల‌కృష్ణ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు. ఎన్‌బీకే 107 సినిమాలో కూడా మాస్ స్టెప్పుల‌తో బాల‌య్య దుమ్ము లేపుతారంటూ ఫ్యాన్స్ ఆశ ప‌డుతున్నారు. 

బాల‌కృష్ణ మాస్ సాంగ్ చేస్తున్న సెట్‌కి వెళ్లిన త‌మ‌న్, కొరియోగ్రాఫర్​ శేఖర్ మాస్టర్ ఫోటోలు దిగారు. మాస్ సాంగ్‌లో బాల‌య్య ఎలాంటి లుక్‌లో క‌నిపించారో రివీల్ అయింది. ఈ సినిమాలో శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మలయాళ బ్యూటీ హనీరోజ్​ రెండో హీరోయిన్​గా కనిపించనుంది.హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓ స్పెషల్​ సాంగ్​ను తెరకెక్కిస్తున్నారు. ప్రత్యేకంగా సెట్స్ కూడా వేశారు. 

డింపుల్ హయాతి ఎన్‌బీకే 107 (NBK 107) మాస్ సాంగ్ పాడింద‌ట‌. చీకటి గదిలో చితక్కొట్టుడు ఫేమ్ చంద్రికా ర‌వి కూడా ఓ సాంగ్‌లో క‌నిపిస్తార‌ట‌. ఈ సినిమాలో దునియా విజయ్ విల్‌న్‌గా న‌టిస్తున్నారు. వరలక్ష్మీ శరత్​కుమార్​ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఎన్‌బీకే 107 మూవీని నిర్మిస్తుంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!