Pooja Hegde: పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా నుంచి తప్పుకున్న పూజా హెగ్డే?

Updated on Jun 04, 2022 10:22 AM IST
పూజా హెగ్డే, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Pooja Hegde, Pawan kalyan, Harish Shankar)
పూజా హెగ్డే, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Pooja Hegde, Pawan kalyan, Harish Shankar)

Pooja Hegde: పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరు. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫుల్ బిజీగా మారింది. ఇటు తెలుగుతో పాటు.. అటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.

ఇక, పూజా హెగ్డే ఇప్పటికే తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి అందరు అగ్రహీరోలతోనూ జోడీ కట్టింది.

అయితే, ఇప్పటివరకు తెలుగులో పూజా హెగ్డేతో కలిసి రెండు సినిమాలు చేసిన ప్రముఖ డైరెక్టర్ హరీశ్ శంకర్.. తాను చేయబోయే కొత్త సినిమాలో కూడా హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నాడు. 

ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో (Powerstar Pawankalyan) చేయనున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాలోనూ పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నాడు హరీష్ శంకర్.  ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఒప్పందాలన్నీ జరిగిపోయాయి. అయితే, ఇప్పుడు ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువ ఆలస్యమవుతూ వస్తుండడం, అందుకు తగినట్టు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం వల్లే.. పూజా హెగ్డే తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.ఇందులో నిజానిజాలు ఎంతో తెలియదు. కానీ.. వార్త అయితే సోషల్‌ మీడియాలో తీవ్రంగా సర్క్యులేట్‌ అవుతోంది. తెలుగు సినిమాల్లోకి వచ్చి ఐరెన్‌ లెగ్‌ అనిపించుకుని.. తర్వాత బాలీవుడ్‌కి (Tollywood) వెళ్లిపోయింది పూజా హెగ్డే. ఆ తర్వాత తిరిగి టాలీవుడ్‌ వచ్చి లక్కీ లేడీ అనిపించుకుంది. ఈ క్రమంలో కుర్ర అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడి కెరీర్‌లో మళ్లీ జర్క్‌లు వస్తున్నాయి. ‘రాధేశ్యామ్‌’, ‘బీస్ట్‌’, ‘ఆచార్య’ అంటూ వరుస ఫ్లాప్‌లు వచ్చి దెబ్బ కొట్టాయి. కానీ ఆమె జోరు మాత్రం తగ్గడం లేదు. బాలీవుడ్‌ సినిమా ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’లో నటిస్తోంది. మహేష్‌బాబు–త్రివిక్రమ్‌ సినిమాలోనూ నటిస్తోంది.

కాగా, పూరీ జగన్నాథ్‌–విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) ‘జనగణమన’  సినిమాకు కూడా సైన్‌ చేయడంతో, ‘భవదీయుడు’ సినిమాను వదులుకుందని చెబుతున్నారు. మామూలుగా అయితే విజయ్‌ సినిమా కోసం పవన్‌ సినిమాను వదులుకునే ధైర్యం ఏ హీరోయినూ చేయదు.

మరి ఇప్పుడు పూజా హెగ్డే ఆ పని చేస్తుందా లేదా అనేది చూడాలి. ఆ విషయం పక్కనపెడితే ఎందుకు దూరం చేసుకుంటోందనే విషయం కూడా ఆలోచించాలి. దీని వెనుక పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ఆలస్యమే కారణం అని టాక్ వినిపిస్తోంది. 

అయితే, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ పాటికే ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ రిలీజ్‌ అవ్వాలి. లేదంటే షూటింగ్‌ అయినా జరుగుతుండాలి. కానీ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ కార్యక్రమాలు, వ్యక్తిగత పనుల వల్ల సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

మరోవైపు ‘వినోదాయ చిత్తాం’ షూటింగ్‌ కూడా త్వరలో ప్రారంభం కాబోతుందనే వార్తలూ వస్తున్నాయి. అందుకే ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే పూజ హెగ్డే (Pooja Hegde) పవన్ తో సినిమాకు నో చెప్పేసిందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!