Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణ బ‌ర్త్ డే స్పెష‌ల్ .. వెండితెరపై ప్ర‌భంజ‌నం సృష్టించిన న‌ట శేఖ‌రుడు

Updated on May 31, 2022 03:01 PM IST
సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు.
సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు.

Krishna:  సూప‌ర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమాను ఉన్న‌త స్థానంలో నిల‌బెట్టిన న‌ట శిఖ‌రం. వంద‌ల సినిమాల‌లో.. వెరైటీ క‌థ‌ల‌తో కృష్ణ ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. హాలీవుడ్ యాక్ష‌న్ సినిమాల‌ను టాలీవుడ్‌కి ప‌రిచ‌యం చేసిన ఘనత కూడా హీరో కృష్ణదే కావడం విశేషం . కౌబాయ్, జేమ్స్ బాండ్ క్యారెక్ట‌ర్ల‌లో కృష్ణ నటించిన తీరు, బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల పంట పండించింది.

చాలా సినిమాలలో న‌ట‌న‌తో పాటు కృష్ణ ద‌ర్శ‌క‌త్వ, నిర్మాణ బాధ్య‌త‌లు కూడా స్వీకరించారు. అంతేకాకుండా రాజ‌కీయ నేత‌గా ప్ర‌జ‌ల అభిమానాన్నీ సంపాదించుకున్నారు సూప‌ర్ స్టార్ కృష్ణ. ఇటీవలే 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని, ప్రస్తుతం 80 వ పడిలోకి అడుగు పెడుతున్నారు. 

బాల్యం
Krishna: సూప‌ర్ స్టార్ కృష్ణ సొంతూరు గుంటూరు జిల్లా తెనాలి మండ‌లంలోని బుర్రిపాలెం గ్రామం. కృష్ణ 1942 మే 31 తేదిన జ‌న్మించారు. ఈయన పూర్తిపేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. తండ్రి ఘ‌ట్ట‌మ‌నేని వీర రాఘ‌వ‌య్య‌. త‌ల్లి నాగ‌ర‌త్న‌. కృష్ణ డిగ్రీ పూర్తి చేశారు. కాలేజీలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావుకు స‌న్మానం చేయ‌డం చూసిన కృష్ణ (Krishna)... ఆ ప్రేరణతో న‌ట‌న వైపు అడుగులు వేశారు. ఆదుర్తి సుబ్బారావు తొలిసారిగా కృష్ణకు సినిమాలలో అవకాశం కల్పించారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు.

కృష్ణ కుటుంబం
సూప‌ర్ స్టార్ కృష్ట (Krishna) మొద‌టి భార్య ఇందిర‌. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గ‌ురు కుమార్తెలు. మొదటి కుమారుడు ర‌మేష్ బాబు కొన్నాళ్లు నటనను కెరీర్‌గా ఎంచుకున్నా.. తర్వాత నిర్మాతగా, వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. ఇటీవలే ఆయన మరణించారు. ఇక ద్వితీయ కుమారుడైన మ‌హేష్ బాబు టాలీవుడ్‌లో సూపర్ స్టార్ హోదాలో దూసుకెళ్తున్నారు. ఇక కృష్ట కుమార్తెలైన ప‌ద్మావ‌తి, మంజుల‌, ప్రియ‌ద‌ర్శినిలలో... మంజుల ఒక్కరే సినీ ఇండస్ట్రీకి వచ్చారు.  కృష్ణ తన తోటి న‌టి అయిన విజ‌య నిర్మ‌ల‌ను ప్రేమించారు. 1969లో తిరుప‌తిలో కృష్ణ.. విజ‌య నిర్మ‌ల‌ను ద్వితీయ వివాహం చేసుకున్నారు. 

సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ, మురళీకృష్ణ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.తున్నారు.

వెండితెర ప్ర‌యాణం
Krishna: కృష్ణ న‌ట‌నే జీవితం అనుకున్నారు. యువకుడిగా ఉన్నప్పుడు.. సినిమాల్లో న‌టించేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ఠ, మురళీకృష్ణ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు కొత్త వాళ్ల‌తో సినిమా తీయాలని భావించినప్పుడు, కృష్ణ‌ను త‌న చిత్రానికి హీరోగా ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత, 'తేనెమ‌న‌సులు' ద్వారా కృష్ణ వెండితెరకు ప‌రిచ‌య‌మ‌య్యారు. తొలి తెలుగు సాంఘిక చిత్రంగా 'తేనెమ‌న‌సులు' సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. 

సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన మూడో సినిమా 'గూఢ‌చారి 116' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. 'గూఢ‌చారి 116' చిత్రాన్ని తొలి జేమ్స్ బాండ్ సినిమాగా కృష్ణ తెర‌కెక్కించారు. ఆ త‌ర్వాత 'మోసగాళ్ళకు మోసగాడు' సినిమాలో కౌబాయ్‌గా కృష్ణ‌ న‌టించారు. ఇక 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో కృష్ణ త‌న న‌ట విశ్వ రూపం చూపించారు. అలాగే తొలి 70 ఎంఎం సినిమా  'సింహాసనం'తో భారీ హిట్ సాధించారు. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం సినిమాల‌తో బాక్సాఫీసును సైతం ద‌ద్ద‌రిల్లేలా చేశారు.

Krishna : కృష్ట  తన తోటి నటులైన ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు చేశారు.

న‌ట‌నే జీవితంగా ప్ర‌యాణం
Krishna : కృష్ట  తాను నటించిన  'అల్లూరి సీతారామరాజు' సినిమా హిట్ అయిన తర్వాత, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. దాదాపు 12 సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బొక్కబోర్లా ప‌డ్డాయి. కానీ న‌ట‌న‌పై ఇష్టాన్ని ఆయన పోగొట్టుకోలేదు. ఎక్క‌డ పోగుట్టుకున్నారో.. అక్క‌డే విజయం సాధించారు కృష్ణ‌. 'పాడిపంట‌లు' మూవీతో మ‌ళ్లీ రికార్డులు నెల‌కొల్పారు. 

ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజులతో కలసి ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు చేశారు.  నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో 30 సంవత్సరాల పాటు, ప్రతీ సంక్రాంతి నాడు.. కృష్ణ నటించిన సినిమాలు విడుదల అయ్యాయి. కృష్ణకు 2500 అభిమాన సంఘాలు ఉండేవి. 50 ఏళ్లకు పైగా సాగించిన తన సినీ ప్రస్థానానికి, 2017 సంక్రాంతి సందర్భంగా కృష్ణ రిటైర్‌మెంట్ ప్రకటించారు. 

సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు.

అవార్డులు
Krishna : కృష్ణ తాను నటించిన  'అల్లూరి సీతారామరాజు ' సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. 1974లో అదే చిత్రానికి ఆయన ఉత్తమ నటునిగా నంది పురస్కారం  పొందారు. అలాగే,  1997లో ఆయనకు ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం ల‌భించింది, 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కృష్ణను గౌరవ డాక్టరేట్‌తో స‌త్క‌రించింది. 2009లో భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారాన్ని అందించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేయడం గమనార్హం. 1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ (Krishna) "నటశేఖర" బిరుదును అందుకున్నారు.

Krishna : కృష్ణ 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ త‌ర్వాత   ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు.

రాజ‌కీయ జీవితం
Krishna : కృష్ణ 1972లో జైఆంధ్ర ఉద్యమానికి  బహిరంగంగా మద్దతునిచ్చారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చి.. నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అయ్యారు. నాదెండ్ల‌ భాస్కరరావును అభినందిస్తూ కృష్ణ పేరిట అప్పట్లో.. ఓ ఫుల్‌పేజీ ప్రకటన విడుదలవ్వడం పెద్ద సంచ‌ల‌నంగా మారింది. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎంపీగా విజయం సాధించారు. ఆ త‌ర్వాత  కృష్ణ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకున్నారు. 2009 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి మ‌ద్ద‌తు తెలిపారు. 

 

సూప‌ర్ స్టార్ కృష్ణ (Krishna) 79 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 80 వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెడుతున్నారు.

Krishna : కృష్ణ  100వ చిత్రమైన 'అల్లూరి సీతారామరాజు' 1974లో విడుదలైంది. హీరోగా తొలి సినిమా విడుదలైన 9 సంవత్సరాలలోనే, కృష్ణ వంద సినిమాలు పూర్తిచేసుకున్నారు. తన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ ఆదరాభిమానాలను పొందారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల‌తో తన అభిమానులకు వినోదం పంచారు. ఎన్నో వంద‌ల సినిమాల‌లో.. వెరైటీ పాత్ర‌లలో న‌టించి మెప్పించారు.

తెలుగు సినిమాకు కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేసింది కూడా కృష్ణ  కావడం గమనార్హం . సూప‌ర్ స్టార్ కృష్ణ టాలెంట్‌తో పైకి వ‌చ్చిన హీరో. న‌టుడుగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా కూడా రికార్డులు నెల‌కొల్పారు. 'అల్లూరి సీతారామరాజు ' దర్శకుడు వి.రామచంద్రరావు ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయిన కొన్నాళ్ళకే అనారోగ్యంతో మరణించారు. కానీ కృష్ణ ఆ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి పూర్తి చేశారు. త‌న విజ‌యాల‌తో పాటు, తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఎద‌గ‌డానికి సూప‌ర్ స్టార్ కృష్ణ ఎంతో కృషి చేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!