NTR Birthday CDP : సెల‌బ్రేష‌న్స్‌కు రెడీ అయిన యంగ్ టైగర్ ఫ్యాన్స్ !

Updated on May 22, 2022 03:56 PM IST
NTR Birthday CDP :ఎన్టీఆర్ అభిమానులు పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమయ్యారు
NTR Birthday CDP :ఎన్టీఆర్ అభిమానులు పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమయ్యారు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌ర్త్‌డే వేడుక‌ల కోసం ఫ్యాన్స్ రెడీ అయ్యారు. సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోల‌తో దుమ్ములేపే ట్రెండ్ సృష్టించ‌నున్నారు. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ సీడీపీని కూడా రిలీజ్ చేశారు. ఇదే క్రమంలో, అభిమానుల కోసం ఎన్టీఆర్ కొత్త సినిమా అప్‌డేట్ ఇవ్వాల‌ని కూడా సంబంధిత దర్శకులను కోరుతున్నారు. ఇప్ప‌టికే ఎన్టీఆర్ 30 పేరుతో ఓ పోస్ట‌ర్ సైతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 

తాజాగా ఆర్.ఆర్.ఆర్. సినిమాలో జూనియ‌ర్ ఎన్టీఆర్, త‌న న‌ట విశ్వ‌రూపం చూపించిన సంగతి తెలిసిందే. 'కొమ‌రం భీముడో' పాట‌తో  ఆయన పాన్ ఇండియా హీరో అయ్యాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కడంతో పాటు, సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ కావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ సారి వ‌చ్చే ఎన్టీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌ల కోసం, అభిమానులు భారీగా ప్లాన్ చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ (NTR) పుట్టిన తేదీ మే 20. ప్రతీ సంవత్సరం ఈ వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. కానీ క‌రోనా కారణంగా, గ‌త రెండేళ్లుగా ఎన్టీఆర్ తన బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌ను నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని అభిమానులకు పిలుపునిచ్చారు. అందుకే, ఫ్యాన్స్ కూడా రెండేళ్ల నుంచి ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్నారు. ఇక ఈ సంవ‌త్స‌రం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు.. యంగ్ టైగర్ పుట్టిన రోజు వేడుకలకు రంగం సిద్ధం చేశారు. అలాగే సేవా కార్యక్రమాలను కూడా భారీగా నిర్వ‌హించడానికి ప్లాన్ చేశారు. 


 

NTR Birthday CDP: ఎన్టీఆర్ న‌టించిన పాత్ర‌ల‌తో బ‌ర్త్ డే సీడీపీ రూపొందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కామన్ డీపీ వైరల్‌గా మారింది. ఎన్టీఆర్‌ బ‌ర్త్ డే రోజు అభిమానుల‌కు స‌ప్రైజ్ కూడా ఉంద‌ట‌. ఇక కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే ఎన్టీఆర్ 30 సినిమాపై అప్‌డేట్ ఇప్ప‌టికే ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ చేతిలో క‌త్తి ఉన్న పిక్ వైర‌ల్ అవుతుంది. అభిమానుల‌కు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసి స‌ప్రైజ్ ప్లాన్ చేశార‌ని టాక్.. 

ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌భాస్ సినిమా స‌లార్‌తో బిజిగా ఉన్నారు. ఆ త‌ర్వాత కేజీఎఫ్ చాప్ట‌ర్ 3 కూడా వ‌స్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రో డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఎన్టీఆర్ సినిమా తీస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎన్టీఆర్ బ‌ర్త్‌డే రోజు ఎలాంటి కొత్త ప్రాజెక్టులు రివీల్ అవుతాయో చూడాలి. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!