‘వెపన్స్‌ లేని వేట’ అంటున్న మహేష్‌బాబు (MaheshBabu)

Updated on Apr 23, 2022 02:04 PM IST
‘సర్కారు వారి పాట’ టైటిల్‌ సాంగ్ రిలీజ్
‘సర్కారు వారి పాట’ టైటిల్‌ సాంగ్ రిలీజ్

సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు లేటెస్ట్‌ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చేసింది. ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ శనివారం రిలీజ్ చేసింది. ‘సర్కారు వారి పాట.. వెపన్స్‌ లేని వేట’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ మహేష్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. పాటను సింగర్‌‌ హారికా నారాయణ్‌ పాడగా.. తమన్‌ మ్యూజిక్‌ అందించారు. మే 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో మహేష్‌ స్టైలిష్‌ లుక్‌తో కనిపిస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించారు.

కొద్దిరోజుల్లో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్​లో భాగంగా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. అనంత శ్రీరామ్‌ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక, ఈ సాంగ్‌ విజువల్స్​ను, లిరిక్స్​ను గమనిస్తే ‘సర్కారు వారి పాట’లో మహేష్‌ క్యారెక్టర్‌‌ ఏంటి ఎంత పవర్‌‌ఫుల్‌గా ఉండబోతోంది అనే విషయం అర్ధమవుతోంది. ఈ మధ్య కాలంలో థమన్‌ చేసిన అన్ని సినిమాల్లో మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌‌ థియేటర్‌‌లో ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వస్తున్న మహేష్‌ మూవీలో కూడా థమన్‌ తన మార్క్‌ మ్యూజిక్‌తో సూపర్‌‌స్టార్‌‌ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ‘కళావతి’ ‘పెన్నీ..పెన్నీ’ అనే సాంగ్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!