థమ్స్ అప్ చూస్తేనే కిక్ ఇస్తుందంటున్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్

Updated on May 29, 2022 09:58 AM IST
థమ్స్ అప్ క్యాన్ పై  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫోటో
థమ్స్ అప్ క్యాన్ పై  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫోటో

విజయ్ దేవరకొండ  (Vijay Deverakonda) ఫొటోతో థమ్స్ అప్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. థమ్స్ అప్ క్యాన్ పై న్యూ లుక్‌తో విజ‌య్ అద‌ర‌గొడుతున్నాడు. త‌మ హీరో ఫోటో థ‌మ్స్ అప్ క్యాన్స్‌పై చూస్తేనే తాగ‌కుండానే కిక్ వ‌స్తుందంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. దేశంతోనే టాప్ కంపెనీలో ఒక‌టి థ‌మ్స్ అప్‌. సాఫ్ట్ డ్రింక్ థ‌మ్స్ అప్  అంబాసిడర్‌గా ఇంత‌క ముందు మ‌హేష్ బాబు ఉండేవారు. మ‌హేష్ బాబు త‌ర్వాత ఆ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌చ్చారు.  మాములుగానే విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌. ఇక థమ్స్ అప్ క్యాన్ పై  విజ‌య్ ఫోటోను చూసి అభిమానులు ఖుషీగా ఉన్నారు.  

 

థమ్స్ అప్ క్యాన్ పై  విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫోటో

థమ్స్ అప్ బ్రాండ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో రీసెంట్‌గా యాడ్ ఫిల్మ్ తీసింది. ఆ యాడ్ అంద‌రినీకీ తెగ న‌చ్చేసింది. హిందీ,  తెలుగులో ఈ బ్రాండ్ యాడ్ ఫిల్మ్ ప్ర‌మోష‌న్ పాపుల‌ర్ అయింది. విజ‌య్ స్టార్ డ‌మ్ రోజు రోజుకు పెరుగుతుంది. ఇక థ‌మ్స్ అప్ యాడ్‌తో మ‌రింత క్రేజ్ సంపాదించుకున్నారు విజ‌య్. ప్ర‌స్తుతం పూరిజ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ  (Vijay Deverakonda) లైగ‌ర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా లైగ‌ర్‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!