అందుకే పొట్టి బట్టలకు 'నో' చెప్తున్నా : 'విరాట పర్వం' హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi)

Updated on Jun 13, 2022 04:33 PM IST
సాయి పల్లవి (Sai Pallavi)
సాయి పల్లవి (Sai Pallavi)

'ఫిదా' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచుకుంది సాయి పల్లవి (Sai Pallavi). ఈమె తాను చేసే పాత్రల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది.

సినిమా కథ, కథాంశంలో తన క్యారెక్టర్‌‌కు ప్రయారిటీ ఉంటేనే ఆ సినిమాను ఓకే చేస్తుంది. హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా తన ఇమేజ్‌‌‌ను పెంచుకుంటూ పోతోంది సాయిపల్లవి. నేచురల్‌గా నటించడంతో పాటుగా గ్రేస్‌గా డ్యాన్స్‌ చేయడం ఆమెకు ఉన్న ప్లస్ పాయింట్.

నాగచైతన్యతో కలిసి సాయిపల్లవి నటించిన సినిమా ‘లవ్‌స్టోరీ‘. ఈ సినిమా ఈ మధ్యనే రిలీజై హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. సాయిపల్లవి కీలక పాత్రలో నటించిన మరో సినిమా ‘విరాట పర్వం’.

ఆ సినిమా షూటింగ్ పూర్తై చాలా రోజులే అయినా.. అనేక కారణాల వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. 1990లలో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా ‘విరాట పర్వం‘ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు వేణు ఊడుగుల.

డాక్టర్‌గా కొనసాగుతా : సాయిపల్లవి

దగ్గుబాటి రానాతో కలిసి 'విరాట పర్వం' చిత్రంలో నటించిన సాయిపల్లవి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. జార్జియాలో మెడిసిన్ పూర్తి చేసిన పల్లవి.. ఇప్పటి వరకు తాను చేసిన పాత్రలన్నీ తనకెంతో సంతృప్తినిచ్చాయని, నటిగా తన కెరీర్ ముగిసింది అని అనిపిస్తే సినిమాలకు గుడ్ బై చెప్పి డాక్టర్‌‌గా కొనసాగుతానని చెప్పింది.

ఒక సంఘటన కారణంగా..

ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉండే పల్లవి.. తమది సాంప్రదాయ కుటుంబం అని, నాన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని, తనకు ఒక చెల్లెలు ఉందని తెలిపింది. ‘ఇంట్లో ఉన్నప్పుడు టెన్నిస్, షటిల్‌ ఆడడానికి కంఫర్ట్‌గా ఉండడం కోసం షార్ట్స్‌ వేసుకుంటాను. యాక్టర్ అయిన తర్వాత జరిగిన ఒక సంఘటనతో.. ఎక్స్‌పోజింగ్ చేసేలా బట్టలు వేసుకోకూడదని నిర్ణయించుకున్నాను’ అని చెప్పింది సాయి పల్లవి.

'డాక్టర్ కోర్సు చేస్తున్నప్పుడు అమ్మానాన్న పర్మిషన్‌తో జార్జియాలో ట్యాంగో డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆ డ్యాన్స్ చేయాలంటే వేరే కాస్ట్యూమ్స్‌ ఉంటాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు 'ప్రేమమ్‌' సినిమాలో నటించే చాన్స్‌ వచ్చింది. ఆ సినిమా హిట్‌ అయిన తర్వాత చాలా మంది నుంచి ప్రశంసలు వచ్చాయి.

అదే సమయంలో ట్యాంగో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌ అయ్యింది. అందులో నా కాస్ట్యూమ్స్‌పై చాలా మంది కామెంట్స్ చేశారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఎక్స్‌పోజింగ్‌ చేసేలా ఉండే బట్టలు వేసుకోకూడదు అని'  అని తన మనసులోని మాటను బయటపెట్టింది సాయిపల్లవి. 

సాయి పల్లవి (Sai Pallavi)

'రీమేక్ సినిమాల్లో క్యారెక్టర్లు చేయాలనే ఉంటుంది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ప్రేక్షకులు ఒరిజినల్ సినిమాలోని క్యారెక్టర్లతో పోల్చి చూస్తారు. అందుకే రీమేక్ సినిమాల్లో నటించాలంటే భయం.

ఆ భయంతోనే చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్‌‌' సినిమాలో అవకాశం వచ్చినా వద్దని అనుకున్నాను. చిరంజీవి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆయన డ్యాన్స్ అంటే మరీ ఇష్టం. 'ముఠామేస్త్రి' సినిమాలో చిరంజీవి స్టెప్పులు చూసి ఫిదా అయ్యాను. ఆయనతో డ్యాన్స్ చేసే చాన్స్ వస్తే అదృష్టంగా భావిస్తాను' అని సాయి పల్లవి (Sai Pallavi) చెప్పుకొచ్చింది.

Read More: విక్ర‌మ్ టీమ్‌కు పార్టీ ఇచ్చిన చిరంజీవి (Chiranjeevi) ! మ‌రి స‌ల్మాన్ ఖ‌న్ (Salman Khan) ఎందుకెళ్లారు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!