విరాట పర్వంలో ఒక సీన్‌ కోసం సాయిపల్లవి (Sai Pallavi) రోజంతా ఏమీ తినలేదు.. డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా !

Updated on Jun 04, 2022 04:22 PM IST
విరాట పర్వంలో సాయిపల్లవి (Sai Pallavi)
విరాట పర్వంలో సాయిపల్లవి (Sai Pallavi)

'ఫిదా' సినిమాలో భానుమతిగా ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి (Sai Pallavi) టాలీవుడ్‌తోపాటు.. కోలీవుడ్‌లోనూ టాలెంటెడ్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. సాయి పల్లవికి యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆమె నేచురల్ నటనకు, డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. పోయినేడాది రెండు సినిమాలతో పలకరించి, రెండూ సూపర్ హిట్లు అందుకుంది. నానితో చేసిన 'శ్యామ్ సింగరాయ్', నాగచైతన్యతో చేసిన 'లవ్ స్టోరీ' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి.

దగ్గుబాటి రానాతో కలిసి సాయిపల్లవి చేసిన సినిమా 'విరాట పర్వం'. వేణు ఉడుగుల డైరెక్షన్‌లో వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన సీన్ కోసం.. సాయి పల్లవి ఒక రోజంతా అన్నం తినకుండా ఉందట. ఆ సీన్‌లోని ఇంటెన్సిటీని, అందులో తన పాత్ర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఆమె అలా చేసిందట. సీన్ సరిగ్గా పండాలనే ఉద్దేశంతో ఒక రోజంతా ఆహారం తీసుకోలేదట ఈ నేచురల్‌ బ్యూటీ.

విరాట పర్వంలో సాయిపల్లవి (Sai Pallavi), రానా

సాయి పల్లవి (Sai Pallavi) చేసిన ఈ పనిని గురించి 'విరాటపర్వం' డైరెక్టర్‌‌ వేణు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. దీంతో సాయిపల్లవి అభిమానులు ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. 'విరాట పర్వం' సినిమా షూటింగ్‌ పూర్తయ్యి చాలా కాలమే అవుతున్నా.. కరోనా మరియు ఇతర కారణాలతో సినిమా రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!